నో కామెంట్ : లోకేష్‌ బాబు సిత్రాలు.. చూసి తరించండి..!

-

తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో.. కావాలని చేస్తారో, ఏమీ కాదులే అనే దైర్యంతో చేస్తారో తెలియదు కానీ… ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్.. తాను చేస్తున్న పనులతో ఒక్కోసారి అడ్డంగా దొరికిపోతుంటారు!! ఒక మాజీ మంత్రి, తమ్ముళ్లు భావిస్తున్నట్లుగా ఆశిస్తున్నట్లుగా భవిష్యత్ టీడీపీ ఆశాజ్యోతి అయ్యిన లోకేష్ కు సంబందించిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది! ఈ విషయం విజయసాయి రెడ్డి దృష్టికి కూడా వెళ్లింది.. ఇంకేముంది ట్విట్టర్ వేదికగా విజయసాయి.. లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు!
కరోనా విషయంలో రాష్ట్రంలో ప్రజలకు పరామర్శించేటంత అందుబాటులో కూడా లేకుండాపోయిన ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్.. తాజాగా రోడ్లపైకి వచ్చిన వీడియో వెలుగులోకి రావడంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు విజయసాయి రెడ్డి!

“కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలు గడప దాటకుండా లాక్‌ డౌన్‌ ను పాటిస్తుంటే.. చంద్రబాబు సుపుత్రుడు ‘మాలోకం’ మాత్రం లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించి యధేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘మాతృభాష’లో కొడుకు దేవాన్ష్‌ కు స్కేట్‌ బోర్డు నేర్పిస్తున్నాడు. హ్యాట్సాఫ్!” అని ముగించి.. అందుకు సంబందించిన వీడియోను పోస్ట్ చేశారు!
విజయసాయి వెటకారం ఆడారని కాదు కానీ… నిజంగా ఆలోచిస్తే ప్రతీ విషయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో పోల్చుకున్నట్లు విమర్శలు ఎదుర్కునే నారా లోకేష్… తన కుమారుడు దేవాన్ష్ కు ఈ సమయంలో రోడ్లపై స్కేట్ బోర్డు నేర్పించడం అవసరమా అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వెళ్లువెత్తుతున్నాయి! కరోనా సమయంలో ఒక బాధ్యతాయుతమైన మాజీ మంత్రిగా… ప్రజలకు ధైర్యం కలిగించే మాటలు చెప్పాలి.. భరోసానిచ్చే పనులు చేయాలి! అవేమైనా చెయ్యాలి అనే అవగాహన లేకపోయినా, అలాంటి ఆలోచన రాకపోయినా.. బుద్దిగా ఇంట్లో ఉండాలి, ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప బయటకు రాకూడదు!

సమాజంలో స్థోమత కలిగి బాధ్యత కలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకులు.. జనాలకు కాయగూరలు, ఆహార పదార్థాలు, మాస్కులు, శానిటైజర్లు పంచుతూ ఎవరికి తోచిన విధంగా వారు ఆ విపత్కర పరిస్థితుల్లో సాయపడుతుంటే… ఈ కనీస విషయాన్ని కూడా మరిచిన లోకేష్… ఇలా రోడ్డుపై స్కేట్ బోర్డుతో కనిపించారు! ఏమంటాం…. నో కామెంట్ అని తప్ప!!

Read more RELATED
Recommended to you

Latest news