బ్రేకింగ్: టీడీపీ మీద విచారణ చేయాలంటూ వైసీపీ నిరసన…!

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ చేసిన అవినీతిపై ఇప్పుడు విచారణ చేయాలి అంటూ వైసీపీ పెద్ద ఎత్తున పార్లమెంట్ లో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ లో నిన్న లోక్సభ పార్టీ నేత మిథున్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అమరావతి భూముల వ్యవహారంలో చేసిన అవినీతికి సంబంధించి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లో జరిగిన అవినీతికి సంబంధించి కూడా విచారణ జరపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు సిబిఐ విచారణ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తాజాగా పార్లమెంట్ లో వైసీపీ నేతలు నిరసన చేశారు. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో చెప్పారు. అమరావతి భూములు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణాలపై సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలోని విజయ్ చౌక్‌ లో, పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల నిరసన ప్రదర్శన” అని పోస్ట్ చేసారు.