సిబిఐ అధికారులకు వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు!

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సనగతి తెలిసిందే. అయితే తాజాగా ఈరోజు ఈ కేసు లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 73వ రోజు కొనసాగుతోంది. ఇవాల్టి విచారణలో భాగంగా… ఓ పోలీస్ కానిస్టేబుల్ మరియు యు.కె తంలో వివేకానందరెడ్డి పొలం పనులు చూసిన సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డిని కూడా సిబిఐ ఇవ్వాల విచారణకు పిలిచినట్లు సమాచారం అందుతోంది.

పులివెందుల ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, చిన్నాన్న మనోహర్రెడ్డి, మరియు వివేకానంద ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ని సిబిఐ బృందం ఇవాళ మరోసారి విచారణకు పిలిచింది. మరోవైపు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇవాళ కడపలో సిబిఐ అధికారులను కలిసింది. దీంతో… ఇవాల్టి సిబిఐ విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసు దర్యాప్తు పురోగతి కి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా సిబిఐ అధికారులను సునిత అడిగినట్లు సమాచారం అందుతోంది. హత్యకు సంబంధించిన కొత్త వివరాలు ఏమైనా బయటపడ్డాయా ? అనే దానిపై కూడా సునీత సీబీఐ అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news