కమలాన్ని కాపాడుతున్న కేసీఆర్..రేవంత్ లాజిక్ కరెక్టే?

-

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీలు ఉప్పు-నిప్పు మాదిరిగా తలపడుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య వార్‌లో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. మొన్నటివరకు దూకుడుగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి రేసులో వెనక్కి వెళ్లిపోయింది. ఇదంతా టీఆర్ఎస్-బీజేపీలు ఆడుతున్న డ్రామా వల్లనే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

మొదట నుంచి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే తరహాలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్-బీజేపీలు ఒక్కటే అని, కేసీఆర్-మోడీలు కలిసి పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఏదో పైకి హడావిడి చేస్తున్నారని, కాంగ్రెస్‌ని దెబ్బకొట్టడానికి రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ విమర్శలని ఎవరు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

అయినా సరే రేవంత్ వెనక్కి తగ్గకుండా విమర్శిస్తున్నారు. ఆ రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్ని మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్‌ని కాపాడటానికి బీజేపీ, కేంద్రంలో బీజేపీని సేవ్ చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అందుకు తగ్గ ఉదాహరణలు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పికప్ అవ్వడం వల్ల కాంగ్రెస్‌ని వెనుకబడినట్లు చూపించాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.

అలాగే దేశంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా పార్టీలని కేసీఆర్ కలుస్తూ…ఏదో థర్డ్ ఫ్రంట్ అంటూ హడావిడి చేస్తున్నారని అంటున్నారు. యూపీఏలో ఉన్న డీఎంకే, ఎన్సీపీ, కమ్యూనిస్ట్‌లను కలుస్తున్నారంటే.. కాంగ్రెస్‌ను బలహీన పర్చడానికి సుఫారీ తీసుకున్నారా? అంటూ నిలదీస్తున్నారు. వాస్తవానికి చూస్తే రేవంత్ చెప్పినట్లు ఆ పార్టీలో యూపీఏలో భాగంగా ఉన్నాయి. మరి ఆ పార్టీలనే కేసీఆర్ కలుస్తున్నారు అంటే..దీని వెనుక ఏదో మతలబు ఉందని డౌట్ పడుతున్నారు. పైగా రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలమైన పార్టీ…అయినా సరే కేసీఆర్, బీజేపీనే టార్గెట్ చేసి…అసలు కాంగ్రెస్ రేసులో లేదు అన్నట్లు హైలైట్ చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి చూస్తున్న కుట్ర అంటున్నారు. ఏమో రేవంత్ మాటలు నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news