అంధకారంలో రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు…!

-

ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి..? ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇదే. టిఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం చేయడానికి ఎప్పుడూ ముందుండే రేవంత్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీలోనే యుద్ధం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. భూ కబ్జా ఆరోపణలు తర్వాత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద లెక్క చేయడం లేదనే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీని ఆయన నడిపిస్తున్నారు అనే కలరింగ్ ఎక్కువగా ఇస్తున్నారంటూ,

కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటుగా కార్యకర్తలు కూడా ఎక్కువగా అభిప్రాయపడుతూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా సొంత పార్టీ నేతల మీద దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనే ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్లాయని ఆ సమాచారం. దీంతో ఆయనను పార్టీ నుంచి తప్పిస్తే మినహా కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టే పరిస్థితి ఉండదని, దయచేసి ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది అంటూ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనితో రేవంత్ రెడ్డి కూడా సస్పెండ్ చేయకముందే బయటకు వస్తే మంచిది అనే భావన లో ఉన్నారట.

అయితే ఆయన బీజేపీ లోకి వెళ్ళిన పెద్దగా ప్రయోజనం ఉండదని, దీంతో ఇప్పుడు ఏ పార్టీలో కి వెళ్ళాలి, లేదా రాజకీయాల నుండి తప్పుకోవాలని అనే దాని మీద కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి భవిష్యత్తు మాత్రం దాదాపుగా ప్రశ్నార్థకమైంది అనే చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం అంటూ ఆయన సమయం వృధా చెయ్యటమే గాని దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది పెద్దగా ఏమీ లేదు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు అసహనం గా ఉన్నారు. ఇక ముందు నుంచి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఇప్పుడు ఆయన వచ్చి అంత హడావుడి చేస్తే దాని వలన ఆయనకు నష్టమే గాని, లాభం ఏమీ లేదని పలువురు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news