ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ముందు నుంచి అనుకున్న విధంగానే మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమల్ నత్వాని, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పేర్లను జగన్ ఖరారు చేశారు. ఈ రాజ్యసభ సీట్ల కోసం పార్టీలో ఉన్న చాలామంది నేతలు ఆశించినా జగన్ మాత్రం వారి వైపు మొగ్గు చూపించారు. అది పక్కనపెడితే సినీ పరిశ్రమలో మోహన్, బాబు మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను నమ్మిన వారికి మాత్రమే ఇచ్చారు.
ఇప్పుడు ఇదే సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది అని అంటున్నాయి సినీవర్గాలు. వాస్తవానికి ముందు మోహన్ బాబుకు జగన్ రాజ్యసభ సీటు ఇవ్వాలని భావించారు. ఆ తర్వాత చిరంజీవి, ప్రధాని మోడీ ద్వారా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. మోహన్ బాబు కూడా అదే విధంగా కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత జగన్ వీరిద్దరిలో ఎవరికి రాజ్యసభ సీటు ఇవ్వాలి అనే దాని పై పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేశారు.
కానీ జగన్ అనూహ్య౦గా ఇద్దరినీ దాదాపుగా పక్కన పెట్టేశారు. మోహన్ బాబు మీద చిరంజీవి, చిరంజీవి మీద మోహన్ బాబు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన చిరంజీవి తన సన్నిహితుల వద్ద మోహన్ బాబు పై విమర్శలు చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన మోహన్ బాబు కూడా చిరంజీవి మధ్యలో రావడం వల్లనే తనకు పదవి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారట. 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీలో చేరిన చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.