విజయనగరం జిల్లా టీడీపీ కీలక నేత మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పొలిటికల్ కెరియర్ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. పూసపాటి రాజ కుటుంబం గా విజయనగరం జిల్లాలో దాదాపు 80 ఏళ్లుగా అధికారం ఆ వంశానికి చెందినవాడు అనుభవిస్తున్నారు. మద్రాసు రాష్ట్రం నుండి ఇ తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరగక ముందు వరకూ పూసపాటి కుటుంబానికి మంచి పేరు ఉండేది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటం తర్వాత అనేక పరిణామాలు జరిగిన విజయనగరంలో ఈ వంశానికి చెందిన వారు రాజకీయంగా ఎదుగుతూనే వస్తున్నారు.రాజకీయంగా మొదటినుండి అశోక్ గజపతి రాజు వైసిపి పార్టీని తీవ్రంగా విభేదిస్తున్న తరుణంలో..జగన్ అధికారంలోకి రావడంతో విజయనగరంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే సింహాచలంలో జరిగే అప్పన్న స్వామి వేడుకలు ఎప్పుడూ కూడా పూసపాటి రాజ కుటుంబం కి చెందిన వాళ్ళ చేతులమీదుగా జరుగుతాయి. ఈ క్రమంలో ఎప్పటినుండో అశోక్ గజపతిరాజు సారధ్యంలో ఆ వేడుకలు జరిగాయి. అయితే ఈ ఏడాది వైసీపీ అధికారంలోకి రావడంతో అశోక్ గజపతిరాజు నీ చాలా తెలివిగా సైడ్ చేయించారు.
మరోపక్క ఇదే సమయంలో దీన్ని డీల్ చెయ్యడం లో భాగంగా అశోక్ గజపతి రాజు అన్నా ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె సంచయిత గజపతిరాజునీ రంగంలోకి దించి చైర్ పర్సన్ పగ్గాలు వైసీపీ పార్టీ అప్పజెప్పడం జరిగింది. తాజా పరిస్థితుల వల్ల అశోక్ గజపతిరాజు పొలిటికల్ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సంచయిత గజపతిరాజు హవా కొనసాగుతోంది. మరోపక్క అశోక్ గజపతిరాజు చైర్మన్ పదవి నుండి తనని వైసీపీ ప్రభుత్వం తప్పించడం పట్ల న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం అశోక్ గజపతిరాజు పొలిటికల్ కెరియర్ మెల్ల మెల్లగా మసకబారుతున్నట్లు విజయనగరం జిల్లాలో వార్తలు వినబడుతున్నాయి.