తాడిపత్రి పెద్దారెడ్డికి సీఎంక్యాంప్ ఆఫీసులో వార్నింగ్ ఇచ్చింది ఎవరు ?

-

అనంతపురం జిల్లా తాడిపత్రి గత పది రోజుల నుంచి వార్తల్లో నానుతూనే ఉంది. సవాళ్లు.. ప్రతిసవాళ్ల స్థాయి దాటి తీయండ్రా బళ్లు అన్న రేంజ్‌ దృశ్యాలు అక్కడ కనిపించాయి. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి అనుచరగణంతో వెళ్లడం.. తదనంతర పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచాయి. ఈ వివాదం అటు చేరి ఇటు చేరి చివరికి సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరింది.సీఎం క్యాంప్‌ ఆఫీసు నుంచి కబురెళ్లడంతో పెద్దారెడ్డి తాడేపల్లి రావడం.. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలపై పార్టీ వర్గాల్లో కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

తాడిపత్రి ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరుపై అటు ప్రజల్లోనూ ఇటు వైసీపీలోనూ తీవ్ర చర్చకే దారితీసింది. తాడిపత్రి ఘటన జరిగిన సమయంలో రాష్ట్రంలో అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్‌. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఇది. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా భారీ ప్రచారంతోపాటు పొలిటికల్‌ మైలేజీ గురించి వైసీపీ ఎన్నో లెక్కలు వేసుకుంది. కానీ.. తాడిపత్రి ఘటనతో సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. ఇళ్ల పట్టాల పంపిణీకి రావాల్సినంత ప్రచారం రాలేదు. మీడియా అటెన్షన్ మొత్తం పది రోజులుగా తాడిపత్రి చుట్టూనే తిరుగుతోంది.

ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి. ఇళ్ల పట్టాల పంపిణీని సీఎం జగన్‌తోపాటు ఎక్కడికక్కడ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అట్టహాసంగా చేద్దామని ప్లాన్‌ చేసుకున్నారు. కానీ తాడిపత్రి ఎపిసోడ్‌ రావణకాష్టంలా మారి అధికార పార్టీ నేతలను నిరాశ చెందారు. పైగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఢీకొట్టింది జేసీ బ్రదర్స్‌ను. వారిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఒక వ్యూహం.. కార్యాచరణ ఉంటుంది. పెద్దారెడ్డి అవేమీ పట్టించుకోకుండా.. సీమ ఫ్యాక్షన్‌ సినిమాను అందరికీ చూపించారు. సీసీ కెమెరాలకు దొరికిపోయారు.

తాడిపత్రి ఎపిసోడ్‌పై వివరణ ఇవ్వాలని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి కబురు అందగానే క్షణం ఆలస్యం చేయలేదు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. అయితే రాగానే సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదట. దాదాపు 5 గంటలు వేచి చూసిన తర్వాత ముఖ్యమంత్రి పిలిచారట. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏదో చెప్పబోతుంటే ముఖ్యమంత్రి మాత్రం గట్టిగానే క్లాస్‌ తీసుకుని పంపించారని తెలుస్తోంది. ఏదో ముఖ్యమంత్రి అన్నారు కదా.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పడక తప్పదు అని అనుకోవచ్చు. కానీ.. ఈ ఎపిసోడ్‌ అక్కడితో ఆగలేదట. క్యాంప్‌ ఆఫీసుకొచ్చి.. సీఎం పిలవడానికి మధ్య ఉన్న ఐదు గంటల వెయిటింగ్‌ టైమ్‌ పెద్దారెడ్డికి మరింత నరకంగా అనిపించిందట.

ఈ సమయంలో సీఎంతో సమీక్ష కోసం వచ్చిన మంత్రులు..అక్కడ తారసపడ్డ పార్టీ పెద్దలు పెద్దారెడ్డికి ఓ రేంజ్ లో క్లాస్‌ తీసుకున్నారట..ముందుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంతు వచ్చిందట. పెద్దారెడ్డి చెప్పిందంతా విన్న సజ్జల.. చివరకు మీరు చేసిందేం కరెక్ట్‌ కాదు అని ముఖం మీదే చెప్పేశారట. ఆ తర్వాత జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అంతే స్థాయిలో క్లాస్‌ తీసుకున్నారట. ఆలోచించక్కర్లేదా.. అలా ఎవరైనా చేస్తారా అని తన స్లయిల్లో మందలించారట బొత్స. చివర్లో సీఎం సరేసరి. క్లైమాక్స్ లో సీఎమ్ సార్ తో అసలు డోస్ పడటంతో బతుకు జీవుడా అని క్యాంపు ఆఫీసు నుంచి బయటపడ్డారట పెద్దారెడ్డి.

సోషల్ మీడియాలో ఏవరో ఏదో అన్నారని ఆవేశపడినందుకు ఆయనకు క్యాంప్ ఆఫీసులో గట్టిగానే తలంటారట. ఓ వైపు వెయిటింగ్ మరోవైపు కనిపించిన వాళ్ళందరు ఇలా ఎందుకు చేశావయ్యా అని అడిగేసరికి నీళ్లు నములడం పెద్దారెడ్డి వంతైంది.

Read more RELATED
Recommended to you

Latest news