ఎవరు ఈ రాబిన్ శర్మ ? ప్రశాంత్ కిశోర్ కంటే తోపుగాడా ? జగన్ మీద అతని  ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదే !

వైసిపి పార్టీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలవటానికి గల కారణాలలో ఒక కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. సరిగ్గా కర్నూలులో జరిగిన ఉప ఎన్నికలు తరువాత వైసిపి పార్టీ దారుణంగా ఓటమి చెందిన తర్వాత  జగన్ వెంటనే ప్రజా సంకల్ప పాదయాత్ర అని స్టార్ట్ చేయడం జరిగింది. సరిగ్గా ఎన్నికల ముందు జగన్ వేసిన ఈ స్ట్రాటజీ కి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్లాన్ లు కూడా తోడవడంతో అదిరిపోయే విజయాన్ని జగన్ సాధించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ని చిత్తు చిత్తుగా ఓడించారు.

Image result for jagan prashanth kishore

ఇటువంటి తరుణంలో చంద్రబాబు తన పార్టీని పైకి తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. కాగా తాజాగా చంద్రబాబు రాబిన్ శర్మ అనే ఎన్నికల వ్యూహకర్త తో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలలో వైసిపి పార్టీ కి చెక్ పెట్టే విధంగా అడుగులు వేయబోతున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. దేశంలోనే ఎన్నికల వ్యూహకర్త నెంబర్ వన్ గా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోనే ఒకప్పుడు రాబిన్ శర్మ పని చేయడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీంతో నుండి బయటకు వచ్చి అద్భుతమైన పొలిటికల్ స్ట్రాటజీ వేస్తూ మెల్ల మెల్లగా పైకి వస్తున్న రాబిన్ శర్మ తో చంద్రబాబు పని చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అదేవిధంగా జగన్ దూకుడు రాజకీయాలు తీసుకుంటున్న నిర్ణయాల విషయాలలో రాబిన్ శర్మ తో చంద్రబాబు చర్చించడం జరిగిందన వార్తలు వస్తున్నాయి. దీంతో ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్న రాబిన్ శర్మ టీం… ఈ నెలాఖరుకు.. ఓ మధ్యంతర నివేదికను చంద్రబాబుకు ఇస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే తరుణంలో జగన్ పై కూడా తన స్పెషల్ ఫోకస్ ప్లాన్ రాబిన్ శర్మ వేసినట్లు..జగన్ కేసులకు సంబంధించి మరియు అదే విధంగా పరిపాలనకు సంబంధించి డేగ కన్ను రీతిలో రాబిన్ శర్మ పొలిటికల్ స్ట్రాటజీ వాడ బోతున్నట్లు టీడీపీకి ప్లస్ గా మారినట్లు సరైన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.