తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ఎవరికి కలిసొస్తాయో…

-

టార్గెట్ గులాబీ….ఇప్పుడు తెలంగాణలో బాగా వినిపిస్తున్న మాట ఇది.పదేళ్ళపాటు అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీని కాంగ్రెస్ నేతలు తెగ టార్గెట్ చేస్తున్నారు. రోజుకోవిధంగా మాట్లాడుతూ కారు పార్టీ అస్తిత్వం కోల్పోయేలా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కనపడదని కొందరు… ఆ పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందని మరికొందరు స్టేట్మెంట్ లు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు,మాజీమంత్రులు,కీలక నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఇదిలా ఉండగా జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వస్తారని మంత్రి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

brs-congress-bjp

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మొన్నటి వరకు గులాబీ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి అందరూ చేరుతారని జోరుగా ప్రచారం చేశారు. అయితే కెసిఆర్ బస్సు యాత్ర, టీవీ9 లాంటి ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం తర్వాత ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఇప్పుడు మరోసారి ఇదే ప్రచారం తెరపైకి వచ్చింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నారని తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబు పేలిచారు. జూన్ 5వ తేదీ తర్వాత గులాబీ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వస్తారని ఆయన తాజాగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు మళ్లీ గులాబీ నేతల్లో కాస్త అలజడి నెలకొంది.

గడిచిన నాలుగు నెలల్లో కాంగ్రెస్ పాలనపై అప్పుడే వ్యతిరేకత వస్తోంది. 6 గ్యారంటీలు సరిగా అమలు చేయకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నవిధంగా సీట్లు సాధించలేదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం లోకసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేసి గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేది సందేహమే. పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది నిజం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు అటు కాంగ్రెస్ కి ప్రమాదం తీసుకొస్తాయా లేక బీఆర్ఎస్ కి కష్టకాలం తెస్తాయా అనేది జూన్ 4 వరకు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news