అవంతి శ్రీనివాస్ కి అంతా కోపం ఎందుకు వచ్చిందో ??

-

విశాఖపట్టణం జిల్లా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తీవ్ర అసహనంతో ఉన్నారు. వైసీపీ పార్టీకి చెందిన కీలక నాయకుడు విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు అవంతి శ్రీనివాస్ తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని సమాచారం. మంత్రి అవ్వాలని టిడిపి పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వచ్చి గెలిచి అవంతి తన కోరిక నెరవేర్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రి అయ్యారు. దీంతో విశాఖపట్టణం జిల్లాలో ఇంకా తిరుగు ఉండదు లే అని అనుకున్నారు.Vijayasai Reddy, Avanthi Srinivas, kaapu meeting, kaapu aatmiya ... ముఖ్యంగా విశాఖపట్నం నీ రాజధానిగా జగన్ చేస్తున్నట్లు ప్రకటన చేసిన తరువాత పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా అవంతి శ్రీనివాస్ మార్చుకోవటం జరిగింది. ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు చేస్తూ టిడిపి వేసే ప్రతి విమర్శ పై కౌంటర్లు వేసే వాళ్ళు. ఈ విధంగా దూసుకుపోతున్న అవంతి శ్రీనివాస్ గత కొన్నాళ్ల నుంచి సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో ఆయన దూకుడు మాటల్లో కూడా జోరు తగ్గింది అన్న టాక్ నడుస్తోంది. కారణం చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయసాయిరెడ్డి దూకుడు అని ఏపీ రాజకీయాల్లో టాక్.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో విజయసాయిరెడ్డి కలుగజేసుకుని అంతా తానై వ్యవహరిస్తున్నారని అవంతి శ్రీనివాస్ తీవ్రంగా కోపం పడినట్లు వైసీపీ పార్టీలో టాక్. దీంతో మొన్నటివరకు తన వెనకాల ఉన్న పార్టీ క్యాడర్ మొత్తం విజయసాయిరెడ్డి చుట్టూ చేరటంతో అవంతి శ్రీనివాస‌రావు మ‌న‌స్థాపానికి గుర‌య్యార‌ట‌. ఈ సందర్భంలోనూ ఇక తాను విశాఖపట్టణంలో ఉన్న వేస్ట్ అని అవంతి బెజవాడకు మ‌కాం మార్చేశార‌ట‌. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టి విజ‌య ‌సాయి రెడ్డి మ‌ళ్లీ అవంతిని బుజ్జగించేందుకు ప్రయ‌త్నించారు. ప్రస్తుతం మాత్రం అవంతి శ్రీనివాస్ వైసీపీ పార్టీలో అంతగా రాణించలేక పోతున్నారని ఏపీ పాలిటిక్స్ లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news