సాక్షి vs ఆంధ్ర జ్యోతి – కథ వేరేవైపు నడుస్తోంది !

-

సాక్షి vs ఆంధ్ర జ్యోతి తెలుగు మీడియా రంగంలో ఈ రెండు మీడియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసినదే. సాక్షి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో నడిచే సంస్థ అయితే ఆంధ్రజ్యోతి చంద్రబాబు కనుసన్నల్లో నడిచే సంస్థ అని అందరికీ తెలుసు. రెండు మీడియా సంస్థలు ఎప్పుడు తమ అభిమాన నాయకుల భజన చేస్తూ ఎప్పటికప్పుడు వార్తలు వడ్డిస్తుంటారు. అదే సమయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు.andhra-jyothi-and-sakshi | తెలుగు360గత ప్రభుత్వంలో ఆంధ్రజ్యోతి చంద్రబాబు భజన భయంకరంగా చేయడంతో గత ఎన్నికల టైం నుండి ఆ ఛానల్ పై ప్రజలకు కొంత బోర్ కొట్టడంతో అప్పటినుండి ఆ ఛానల్ వార్తలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కాగా వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత సాక్షి కూడా ఇటీవల జగన్ ప్రభుత్వం పట్ల భజన కార్యక్రమాలు ఏబీఎన్ మాదిరిగానే వ్యవహరిస్తోంది. జగన్ గెలిచిన నాటినుండి భయంకరంగా భజన చేయడంతో దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు పబ్లిక్.

 

ఇలాంటి సందర్భంలో మీడియా క్రేజ్ తగ్గుతున్న క్రమంలో ఈ రెండు మీడియా సంస్థలు తమ యజమానుల భజన కార్యక్రమాలను ఆపేశారు అట. తాజాగా ఇతర కార్యక్రమాలపై దృష్టి పెడుతూ ఎక్కడా కూడా జగన్, చంద్రబాబు పేరు రాకుండా చూసుకుంటున్నారని మీడియా వర్గాల్లో టాక్. కారణం చూస్తే ప్రజలలో నమ్మకాన్ని కలిగించే విధంగా వ్యవహరించడానికి పూర్తిగా కథ వేరే వైపు రెండు మీడియా సంస్థలు నడిపిపిస్తున్నాయని అంటున్నారు. ఎక్కువగా జాతీయ రాజకీయాలపై ఈ రెండు మీడియా సంస్థలు ఫోకస్ పెట్టినట్లు తెలుగు మీడియా వర్గాల్లో టాక్.

 

Read more RELATED
Recommended to you

Latest news