ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైఎస్ జగన్ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్ ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా సరైన సమీక్షా సమావేశం నిర్వహించడం దాదాపుగా కనపడలేదు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాని జగన్ మాత్రం ఇప్పటి వరకు మీడియా ముందుకి రాలేదు. వచ్చినా గాని ఆయన మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు.
ఏపీలో కరోనా వైరస్ కేసుల గురించి మీడియా పొద్దుపోయిన తర్వాత బయటపెడుతుంది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా అధికారుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఆయన కనీసం ఇప్పుడు అధికారులతో సమావేశాలు నిర్వహించడం లేదు. ఎక్కువగా మంత్రులు మీడియా ముందు కనపడుతున్నారు. ఆయన ఎక్కడా కనపడటం లేదు.
ఇప్పుడు కరోనా కట్టడి చేయడానికి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రైతుల విషయంలో కెసిఆర్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రైతులు ఎవరూ కూడా ఉత్పత్తుల విషయంలో భయపడవద్దని ప్రతీ ఒక్కటి కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని కెసిఆర్ ధైర్యం చెప్పారు. కాని జగన్ మాత్రం ఇప్పటి వరకు రైతుల విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పరిస్థితి ఏంటీ అని పలువురు ప్రశ్నిస్తున్నారు.