కాంగ్రెస్ పార్టీకి ఇంద్రవెల్లి ఎందుకు సెంటిమెంట్ గా మారిందంటే..

-

కాంగ్రెస్ పార్టీ మరోసారి సెంటిమెంట్ ను నమ్ముకుంది.. లోక్సభ ఎన్నికల సమర శంఖాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో పూరించబోతున్నారు.. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన ప్రతి ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు..

తెలంగాణలోని అతిపెద్ద గిరిజన జాతర నాగోబా.. ఆదివాసులు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇంద్రవెల్లిలో ఉన్న టెంపుల్ ను దర్శించుకోవడం సెంటిమెంట్ గా మారింది.. అసెంబ్లీ ఎన్నికలకి ముందు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్ది ఇక్కడ నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అయ్యిందట.. ఒకరకంగా చెప్పాలంటే పార్టీకి ఈ సభ మంచి ఊపు తెచ్చిందని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.. అలాగే అప్పుడు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కూడా నాగోబా మీదుగా ఇంద్రవెల్లి అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సాగింది..

2021 లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా దళిత గిరిజన గౌరవ దండోరా కార్యక్రమం ఇంద్రవెల్లిలో నిర్వహించారు.. ఈ సభ పార్టీకి పునర్జీవనం తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఈ సభ ఇచ్చిన జోష్ తోనే అన్ని జిల్లాలలో సభలు పెట్టి దళితుల్ని ఆకర్షించుకోగలిగామని నేతలు చెబుతున్నారట..

2022లో రేవంత్ రెడ్డి నాగోబాను దర్శించుకుని.. మెస్రం వంశీయుల ఆశీస్సులు తీసుకున్నారట. ఆ ఆశీస్సులు ఫలించాయని.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ఇంద్ర వల్లి సెంటిమెంట్ గా మారిందని పార్టీలో చర్చ నడుస్తోంది.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంద్రవెల్లిలో పెట్టిన సభలే విజయవంతమయ్యాయని.. లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని కూడా అక్కడే పూరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట..

అసెంబ్లీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వడంతో ఎన్నికల శంఖారావం కూడా ఇక్కడినుంచి పూరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు.. రాజకీయ నాయకులు పట్టించుకోని జిల్లాగా అదిలాబాద్కు పేరు ఉంది.. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. సీఎం రేవంత్ రెడ్డి తరచూ ఈ జిల్లాలో పర్యటించడంతో జిల్లా అభివృద్ధిపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.. కాంగ్రెస్ హయాంలోనైనా తమ జిల్లా అభివృద్ధి చెందుతుంది భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంద్రవెల్లి సెంటిమెంట్ కంటిన్యూ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news