తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్, హరీశ్‌రావులే అసెంబ్లీలో కొట్లాడారు. వీరిద్దరే అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అంతే కాదు ప్రజల్లో కూడా వీరిద్దరి మీద మంచి అభిప్రాయం ఉంది. ఉద్యమ నేతలుగా టీఆర్ ఎస్‌లో వీరికి మాత్రమే క్రేజ్ ఉంది.
ఇప్పుడు ఎలాగూ ఈటలను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఎలాగైనా ఈటలను ఒంటరి చేయాలని భావిస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటికే గంగుల కమలాకర్‌ను రంగంలోకి దింపాడు. అయితే ఆయన పెద్దగా ఫలితాలు రాబట్టలేకపోయారు.
ఈటల బలం పెరగకూడదు, ఇదే టైమ్‌లో ఈటలకు ఎవరూ సపోర్టుగా ఉండకూడదని సీఎం కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేశాడు. ఈటలకు అత్యంత సన్నిహితుడైన హరీశ్‌రావును హుజూరాబాద్ రాజకీయాలకు ఇన్‌చార్జిగా నియమించారు. హరీశ్‌రావును ప్రత్యర్థిగా నియమిస్తే.. అప్పుడు ఎవరూ పార్టీ లైన్ దాటరనేది కేసీఆర్ ప్లాన్. ఇప్పుడు హరీశ్‌రావు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు. మరి ఈటల వారిని ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.