వై నాట్ కుప్పం వర్సెస్ వై నాట్ పులివెందుల..ఏది సాధ్యం?

-

ఏపీ రాజకీయాల్లో నేతల మాటలు కోటలు దాటుతున్నాయనే చెప్పాలి. ఎవరికి వారు ప్రజా మద్ధతు విషయంలో పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఓ వైపు వైసీపీ ఏమో..కుప్పంతో సహ 175 సీట్లు గెలిచేస్తామని అంటుంటే..ఇటు టి‌డి‌పి ఏమో పులివెందులతో పాటు అన్నీ సీట్లు గెలుస్తామని చెబుతుంది. ఇలా రెండు పార్టీలు హోరాహోరీగా రాజకీయం నడిపిస్తున్నాయి.

అయితే సాధ్య అసాధ్యాలు పట్టించుకోకుండా రెండు పార్టీలు ముందుకెళుతున్నాయి. ఏదైనా మాట్లాడితే కాస్త రియాలిటీకి దగ్గరగా ఉండాలి. కానీ రెండు పార్టీలు రియాలిటీకి దూరంగానే ఉన్నాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వై నాట్ కుప్పం అంటుంది. కుప్పంలో చంద్రబాబుని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. అక్కడ అధికార బలంలో స్థానిక ఎన్నికలు, పంచాయితీలు, కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుంది. అదే ఊపుతో కుప్పం అసెంబ్లీని కూడా గెలుస్తామని అంటున్నారు. కానీ ఇది సాధ్యమయ్య పని కాదు.

కుప్పం ప్రజలు చంద్రబాబు వైపే ఉన్నారని సర్వేల్లో తెలుస్తుంది. కాబట్టి కుప్పంలో వైసీపీ గెలవడం కల. ఇక వైసీపీ కుప్పంని టార్గెట్ చేసిందని టి‌డి‌పి..పులివెందులని టార్గెట్ చేసింది. తాజాగా పులివెందులలో సభ నిర్వహించిన బాబు..వై నాట్ పులివెందుల అని అన్నారు. అంటే పులివెందుల కూడా గెలిచేస్తామనే ధీమాతో ఉన్నారు.

కానీ అది అసలు సాధ్యం అవ్వని పని..ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అక్కడ జగన్ మెజారిటీ తగ్గిస్తే చాలు టి‌డి‌పి సక్సెస్ అయినట్లే. అది కూడా సాధ్యం కాదు. గత ఎన్నికల్లో జగన్‌కు 90 వేల మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీని టి‌డి‌పి తగ్గిస్తే గ్రేట్. కాబట్టి వై నాట్ కుప్పం సాధ్యం కాదు. వై నాట్ పులివెందుల అంతకంటే  సాధ్యం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news