నర్సీపట్నంలో ఎప్పటికప్పుడు వివాదాలు రేగుతూనే ఉన్నాయి.గతంలో కూడా సీనియర్ లీడర్ అయిన అయ్యన్న నోరు అదుపులో ఉంచుకోకుండా మాట్లాడిన దాఖలాలే ఉన్నాయి అని కొన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి.ఆడియో క్లిప్పింగులు కూడా చాలా సందర్భాల్లో టీడీపీ అధికారంలో ఉండగా, కోల్పోయాక కూడా వైరల్ అయ్యాయి. కనుక ఇక్కడ అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతతోనే వైసీపీ రాజకీయంగా నెగ్గిందని అనుకోలేం కానీ ఇదొక తాత్కాలిక గెలుపు మాత్రమే అని భావించాలి.
ఓ సీఎం స్థాయి వ్యక్తిని తిట్టే పనిలో ఎప్పటికప్పుడు అయ్యన్న ఉంటున్నారు. పోనీ ఆయన ఉంటే ఉండనీ ఆయన బిడ్డ విజయ్ కూడా అదేవిధంగా నోరు పారేసుకుంటున్నారు. కేవలం మాటల యుద్ధంతోనే రాజకీయంలో నెగ్గుకు రావాలనుకోవడం అన్నది సబబు కాదని గతంలో ఆయనకు కొందరు చెప్పిన చూసినా జూనియర్ పాత్రుడు మాట విన్న దాఖలాలే లేవు అని తెలుస్తోంది.
సీఎం హోదాకు గౌరవం ఇవ్వక వాడు, వీడు అని మాట్లాడడం కూడా తగదని, కేవలం మాటలకే ఇన్ని యుద్ధాలు వివాదాలు వస్తుంటే రేపటి వేళ ప్రజలు వీరి నుంచి ఎటువంటి పాలన ఆశించవచ్చని ఓ ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయినా కూడా అయ్యన్న అటవీ శాఖ మంత్రిగా చేసినప్పుడు కూడా పలు ఆరోపణలు ఎదుర్కోన్నారు. వా టిపై వైసీపీ దర్యాప్తు చేయొచ్చు. కానీ చేయడం లేదు.
ఇప్పుడు అనే కాదు టీడీపీ టైంలో కూడా గంజాయి సాగుకు సంబంధించి విశాఖ ఏజెన్సీ కేంద్రంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిపై కూడా వైసీపీ దర్యాప్తు చేయవచ్చు. కానీ చేయదు. కేవలం పై,పై మాటలతోనే కాలం వెళ్లదీయడంలో వైసీపీ ముందుంది అన్నదే వాస్తవం. కనుక ఈ తగాదాలో ఇరు వర్గాలదీ తప్పుంది.