రేవంత్ కు ఆదిలోనే సెగనా… అసలు పార్టీ నాయకులు కలిసి వస్తారా…

-

ఎన్నో రోజులుగా ఊరిస్తూ… వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడెవరనేది కాంగ్రెస్ పెద్దలు నిన్న ప్రకటించారు. మల్కాజ్ గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిని నూతన పీసీసీ అధ్యక్షుడిగా నిర్ణయిస్తూ… ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా… కాంగ్రెస్ లోని చాలా మంది నేతలు రేవంత్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే అధిష్టానానికి లేఖల ద్వారా స్పష్టం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది.

రేవంత్ రెడ్డి వద్దని ఎంత మొత్తుకున్నా.. కూడా అధిష్టానం తమ మాటను పట్టించుకోలేదని.. సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. రేవంత్ కు సహకరించేది లేదని అంటున్నారు. తాజాగా ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారి మధ్య ఉన్న గ్యాప్ ను సూచిస్తున్నాయి. తాను ఇకపై గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనని శపథం చేశారు. అధిష్టానం కార్యకర్తల మనోభావాలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి పేరును ఇలా ప్రకటించగానే… మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అసంతృప్తితో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికే రాజీనామా చేశారు. దీనిని పెద్దగా పట్టించుకోని రేవంత్ రెడ్డి పార్టీలో సీనియర్ నాయకులైన జానా రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులను కలిశారు. పార్టీని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. తాజాగా ఎంపీ కోమటి రెడ్డితో పాటు మరో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ప్రకటించినపుడు బీజేపీ నాయకులంతా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బండి సంజయ్ కి సన్మాన సభ ఏర్పాటు చేశారు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో అలా జరగకపోగా.. అందరూ రాజీనామాలు చేస్తూ… తమ అసమ్మతిని తెలపడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version