ఒక్క రూపాయి రేట్ పెరిగితే బంక్ ల దగ్గర పెద్ద ఎత్తున క్యూ లు కడతారు. అదే ఇప్పుడు బంక్ ల దగ్గర డబ్బులు ఇచ్చి మరి పెట్రోల్ పోస్తారని తెలిస్తే ఇంకెంత పెద్ద ఎత్తున క్యూలు కడతారో ఊహించుకోండి. క్రూడ్ ఆయిల్స్ లో కొన్ని రకాలు ఉన్నాయి.వాటిలో వెస్ట్ టెక్సాస్ ఇంటిమిడేట్, బ్రెంట్, నెమేక్స్ అనేవి ప్రధానమైనవి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ మార్కెట్ లో వెస్ట్ టెక్సాస్ ఇంటిమిడేట్ యొక్క ధరలు మైనస్ లోకి పడిపోయాయి. వచ్చే నెలకు సంబందించిన వెస్ట్ టెక్సాస్ ఇంటిమిడేట్ యొక్క ధరలు బ్యారల్ కు ఒక దశలో మైనస్ 10, 20, 30 డాలర్స్ కు పడిపోయింది. అంటే బంక్ వాడే తిరిగి వినియోగదారుడికి తిరిగి డబ్బులు ఇవ్వడం లాంటిదన్న మాట. ఇప్పుడు అమెరికాలో అమెరికాలో వందల ఆయిల్ కంపెనీల పరిస్థితి ఇలానే ఉంది.
రోజుకు కొన్ని వేల మరణాల కారణంగా అమెరికా ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయాన ఇలా క్రూడ్ ఆయిల్ కంపెనీస్ దివాలా తియ్యడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీని ప్రభావం ఇతర దేశాల స్టాక్ మర్కెట్స్ పై కూడా పడనుంది. ఈ రానున్న ఎకనామికల్ డిప్రెషన్ ని ప్రపంచ దేశాలు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాలి