వైసీపీలో వార్..ఇండిపెండెంట్‌గా బోస్..డ్యామేజ్ ఎవరికి?

-

రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీలో అంతర్గత పోరు ఆగడం లేదు. అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య వార్ నడుస్తూనే ఉంది. సీటు కోసం ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. ఒకవేళ సీటు దక్కకపోతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని బోస్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక సీటు విషయం జగన్ చూసుకుంటారని వేణు అంటున్నారు.

అయితే ఏది ఎలా జరిగిన దీని వల్ల రామచంద్రాపురంలో వైసీపీకి నష్టం జరిగేలా ఉంది. వాస్తవానికి ఈ సీటు బోస్ సొంత సీటు..గతంలో బోస్ మూడుసార్లు అక్కడ గెలిచారు. అలాగే కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. జగన్ కోసం త్యాగం చేసి వైసీపీలోకి వచ్చి 2012 ఉపఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో ఓడారు. ఇక 2019లో తన సీటుని వేణు కోసం త్యాగం చేసి..తాను మండపేటలో పోటీ చేసి ఓడిపోయారు.  ఇటు వేణు గెలిచారు. అయితే జగన్..బోస్ త్యాగం గుర్తించి..ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత మండలి రద్దు అనడంతో మళ్ళీ బోస్ పదవులకు రాజీనామా చేశారు. దీంతో జగన్..బోసుకు రాజ్యసభ ఇచ్చారు.

ఇటు వేణుకు మంత్రి పదవి దక్కింది. అటు గత ఎన్నికల్లో రామచంద్రాపురం బరిలో టి‌డి‌పి నుంచి పోటీ చేసిన ఓడిన తోట త్రిమూర్తులు వైసీపీలోకి వచ్చారు. ఇక ఆయనకు మండపేట బాధ్యతలు ఇచ్చారు. అయితే రామచంద్రాపురంలో వేణు హవా నడుస్తుంది..అటు బోసు, ఇటు తోట వర్గాలని పక్కన పెట్టేశారు.

అదే బోస్‌కు ఇబ్బందిగా మారింది. వేణు విజయం కోసం కష్టపడిన తమ వారిపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వేణుకు సీటు ఇవ్వకూడదని, తనకు గాని, తన వారసుడుకు గాని సీటు అడుగుతున్నారు. ఒకవేళ వేణుకు సీటు ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అంటున్నారు. ఇటీవల జగన్ పిలిచి మాట్లాడారని వేణుతో కలవడానికి రెడీగా లేనని చెప్పేసాని అన్నారు. జగన్ తనకు అన్నీ విధాలుగా న్యాయం చేశారని, కానీ కార్యకర్తల అభీష్టం మేరకే ముందుకెళ్తానని అన్నారు. మొత్తానికి వీరి మధ్య రచ్చ..వైసీపీకి నష్టం చేసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news