అన‌వ‌స‌రంగా అలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్న వైసీపీ.. చివ‌ర‌కు విమ‌ర్శ‌ల పాలు

-

ఏ పార్టీ అయినా స‌రే తాము అధికారంలో ఉన్న‌ప్పుడు తీసుకునే నిర్ణ‌యాలు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. రాజ‌కీయ భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి. లేదంటే మాత్రం ఇర‌కాటంలో ప‌డాల్సిందే. ఇప్ప‌టికే ఈ విష‌యంలో ఎన్నో పార్టీలు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాయి. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కూడా ఇలాంటి త‌ప్పే చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ తీసుకుంటున్న ఓ నిర్ణయం చివ‌ర‌కు విమర్శల‌కు దారి తీసింది. దీంతో ఆ విష‌యంలో ఏకంగా వెనకుడుగు వేయాల్సిన ప‌రిస్థితులు వ‌స్తున్నాయి.

Jagan
Jagan

ఇటీవ‌ల ఏపీలో మటన్ మార్టులు ఏర్పాటు చేస్తామ‌ని ఇందుకోసం జ‌గ‌న్ ప్రభుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక్క‌డ మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో సాక్షిలోనే ఓ పెద్ద ఆర్టికల్ ప‌బ్లిష్ కావ‌డం, దాంతో పాటు న్యూస్ ఛానెల్ లో కూడా పెద్ద ఎత్తున వార్త‌లు రావ‌డం స్టార్ట్ అయింది. ఆ త‌ర్వాత‌నే మిగ‌తా మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. అన్ని మీడియాలో కంటే కూడా ముందుగా సాక్షి పేప‌ర్‌లోనే దీని గురించి వ‌చ్చింది.

ఇక్క‌డ దాకా బాగానే ఉన్నా.. ఇటీవ‌ల ఈ నిర్ణ‌యం మీద ఏపీ ప్ర‌జ‌ల నుంచి అటు ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి పెద్ద‌ ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో అంతా వెన‌క్కు త‌గ్గారు. ఒక ప్రభుత్వం మటన్ వ్యాపారం మీద ఆదాయం సంపాదించుకోవాల‌ని చూడ‌ట‌మేంట‌ని అంద‌రూ వ్య‌త‌రేకించారు. ఇంకేముంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యంపై వెనకడుగు వేయడం సంచ‌ల‌నం రేపింది. ఇక మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ త‌మ‌కు మ‌ట‌న్ మార్టులు పెట్టాల‌నే ఆలోచ‌న లేద‌ని, కావాల‌నే త‌మ ప్ర‌భుత్వంపై ఎల్లో మీడియాలో క‌ట్టు క‌థ‌లు అల్లింద‌ని చెప్పారు. దీంతో అటు ప్ర‌భుత్వం మీద ఇటు ఆ మంత్రి మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news