జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో వైసీపీ మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే

-

ఏపీలో అధికార వైసీపీ నేత‌ల్లో రోజు రోజుకు చిన్న చిన్న ఇష్యూల‌కు కూడా పెద్ద పెద్ద గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. పార్టీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు కూడా కాకుండానే సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్లు.. మంత్రులు వ‌ర్సెస్ ఎంపీలు.. మంత్రులు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య గొడ‌వ‌లు రోజు రోజుకు ముదురుతున్నాయి. జ‌గ‌న్ ఎన్ని వార్నింగ్‌లు ఇస్తున్నా ఇవి మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వ‌ర్సెస్ స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి మ‌ధ్య పంచాయితీ అలా ప‌రిష్క‌రించారో లేదో ?  మ‌ళ్లీ కొత్త గొడ‌వ జ‌రిగింది.

శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల్లోకి వ‌చ్చిన కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు పట్టిన తర్వాత జగన్‌ అనంతపురంలో పర్యటించడం ఇదే తొలిసారి. దీంతో జిల్లాకు చెందిన వైసీపీ నేత‌లు భారీ ఎత్తున ఆయ‌న‌కు స్వాగ‌త‌, స‌త్కారాలు ఏర్పాటు చేశారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ తొలిసారి అనంతపురం విచ్చేస్తున్న క్ర‌మంలో హెలిప్యాడ్‌ వద్ద మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యే  అనంత వెంకట్రామిరెడ్డి స్వాగతం పలికారు.

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికే జాబితాలో తన పేరు లేకపోవడంతో  తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరును ఎందుకు చేర్చలేదని మంత్రి శంకర్‌నారాయణ్‌ను నిలదీశారు. ఈ సందర్బంగా మంత్రి త‌న‌కు తెలియ‌ద‌ని స‌మాధానం చెప్ప‌డంతో
ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇప్ప‌టికే జిల్లాలో మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌కు చాలా మంది రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేల‌కు ప‌డ‌డం లేదు. ఇక ఇప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న రోజునే మ‌రో ఎమ్మెల్యేకు మంత్రికి మ‌ధ్య చిన్న విషయానికి సైతం గొడ‌వ జ‌ర‌గ‌డం గ‌మనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news