ఎంపీ ర‌ఘురామపై ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం వెళ్తున్న జ‌గ‌న్‌.. స‌క్సెస్ అవుతాడా?

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎంత పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు సీఎం జ‌గ‌న్ చాలా వ్యూహాత్మ‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. రీసెంట్‌గా ఆయ‌న ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిశారు. దీంతో ఒక్క‌సారిగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆయ‌న ఢిల్లీ వెళ్లిన త‌ర్వాత ఇప్పుడు ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది.

మొన్న‌టి దాకా ర‌ఘురామ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కేంద్ర‌మంత్రుల‌కు ఫిర్యాదు చేస్తే… ఇప్పుడు ఆయ‌న‌కు చెక్ పెట్టాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ రాజ‌మండ్రి ఎంపీ అయిన మార్గాని భరత్ కుమార్ రంగంలోకి దిగారు. భ‌ర‌త్ రీసెంట్ గా లోక్ సభ స్పీకర్ ను కలిసి ర‌ఘురామ‌పై ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీలో ఉంటూ ప్ర‌భుత్వానికి, పార్టీ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా ఎంపీ వ్య‌వ‌హ‌రించారంటూ అందుకే ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని భ‌ర‌త్ కోరారు. అయితే ఈయ‌న ఫిర్యాదుపై బీజేపీ కావాల‌నే తాత్సారం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో రాజ‌కీయ కోణం ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ర‌ఘురామ‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటున్న బీజేపీ.. ఇప్పుడు జ‌గ‌న్ ప్లాన్‌ను ఏ మేర‌కు స‌క్సెస్ చేస్తుందో చూడాలి. కానీ జ‌గ‌న్ మాత్రం మ‌రో ప్లాన్‌కు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.