కరోనా వైరస్ కట్టడి విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల లో కేసిఆర్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలు ఏవిధంగా సహకరించాలి అన్న దాని పై పబ్లిక్ కి అదేవిధంగా మీడియాకి అర్థమయ్యేరీతిలో వివరంగా చెబుతున్నారు. వైరస్ తీవ్రత గురించి చెబుతూనే ప్రజలను హెచ్చరిస్తూ విలేకరుల సమావేశాలు పెట్టిన కేసిఆర్ ఇంటి యజమానులకు అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలకు గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మార్చి, ఏప్రిల్, మే ఈ మూడు నెలలకు సంబంధించి ఇంటి యజమానులు అద్దె ఎవరు వసూలు చేయకూడదని కేసీఆర్ తేల్చి చెప్పారు.రాష్ట్రంలో ఎవరైనా ఇంటి యజమానులు వసూలు చేయాలని ఒత్తిడి తీసుకు వస్తే….వెంటనే బాధితులు వందకి డైల్ చేయాలని కోరారు. అంతేకాకుండా కఠినమైన చర్యలు తీసుకుని వారిపై కేసులు పెట్టడం గ్యారెంటీ అని హెచ్చరించారు. నోటి మాట కాదు ప్రభుత్వ ఆదేశం గా చెబుతున్నట్లు తెలిపారు. ఇదే టైములో స్కూల్ ఫీజుల విషయంలో యాజమాన్యాలు స్కూల్ ఫీజు రూపాయి కూడా పెంచకూడదు అని స్పష్టం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని అందరూ గుర్తించాలని కోరుతున్నారు. ఎవరైనా అధికమైన ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అంటూ హెచ్చరించారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కేసీఆర్ మీడియా సమావేశం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలాంటి అభయం మాకు కూడా జగన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చేతిలో పని లేదు, తినడానికి తిండి లేదు, బయట అడుగు వేసే ప్రసక్తి లేదు. పరిస్థితిని అర్థం చేసుకుని జగన్ కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తీసుకోవాలని, రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతున్నారు. ఇలాంటి టైమ్ లో కాకపోతే ఇంకెప్పుడు ‘అభయం’ ఇస్తారు అంటూ ఫైర్ అవుతున్నారు.