ఇంగ్లీష్ మీడియం పై జగన్ సర్కార్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇంగ్లీష్ మీడియం కి వ్యతిరేకంగా ప్రభుత్వానికి తీర్పు వచ్చినా సుప్రీంకోర్టులో తేల్చుకోవడానికి జగన్ రెడీ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా న్యాయపరంగా ఉన్న చిక్కులను అధిగమించాలంటే ముందుగా విద్యార్థుల తల్లిదండ్రుల నాడి ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. అందుకే ఇంగ్లీషు మీడియం పై కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వం రాత మూలకంగా అభిప్రాయ సేకరణ చేపట్టింది.
2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయాలు తెలుసుకుని నివేదించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం అప్పట్లో జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు మూడు ఆప్షన్లు పెట్టింది. అవి తెలుగు తప్పనిసరిగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన . ఇతర భాషల్లో బోధన అనే మూడు ఆప్షన్లు ఇచ్చారు. 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 17,87,035 మంది ఉన్నారు. వీళ్లలో 17,85,669 మంది తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా 96 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు జగన్ నిర్ణయానికి జై కొట్టారు. ఈ పరిణామంతో కచ్చితంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది విద్యా సంవత్సరం జగన్ నిర్ణయాల మేరకు నడిచే అవకాశం ఉందని వైసీపీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఒక్క శాతం ఉన్న కోర్టు ఆప్షనల్ పెట్టండి అని చెబుతోంది అంటూ న్యాయ నిపుణులు అంటున్నారు. మోర్ ఓవర్ సర్వే తీసుకోమని ఏ కోర్టు చెప్పలేదని ఈ విషయంలో సుప్రీం కోర్టులో కూడా జగన్ సర్కార్ కి మొట్టికాయలు పడే అవకాశం ఉందని న్యాయనిపుణుల టాక్.