ప్రజలు స్ట్రాంగ్ గానే ఉన్నారు – మరి పాలకులో ?

-

ఇండియాలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య చూస్తే 35 వేలకు పైగానే నమోదు అయ్యాయి. మరోవైపు వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. రోజురోజుకీ లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నా కానీ కొంతమంది సరిగ్గా పాటించకపోవడం తో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి.Bhubaneswar, Cuttack will continue to remain under lockdownచాలా వరకు ఇండియాలోప్రారంభంలో కంటే పరిస్థితి ప్రస్తుతం కఠినంగా ఉన్నా గాని ప్రజలలో ఒక అవగాహన అంటూ వచ్చింది. ఎవరికి వారు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అదేవిధంగా మాస్కు తప్పనిసరిగా ధరిస్తున్నారు. అదే సమయంలో లాక్ డౌన్ పొడిగించిన ప్రస్తుతం మాత్రం తట్టుకునే ఈ విధంగా ప్రజలు చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు.

 

పక్క దేశాలలో మరియు యూరప్, అమెరికా దేశాలలో కనబడుతున్న పరిస్థితి చూసి చాలా వరకు దేశంలో ఇటువంటి పరిస్థితి తమ కుటుంబాల్లో రాకుండా ఉండడానికి లాక్ డౌన్ పొడిగించినా ఫర్వాలేదన విధంగా ప్రజలు సహకరిస్తున్నారు. ఓవరాల్ గా ఇండియాలో రోజురోజుకి కేసులు పెరుగుతుండటం, మరణాల సంఖ్య పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగించే విషయం కావడంతో, ప్రజలు కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్ డౌన్ చేపట్టిన సహకరించడానికి రెడీ గానే ఉన్నారు. మరి పాలకులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news