‘ఎంత ఇస్తారు’ ఓపెన్ గా అడుగుతున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు???

-

రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల ను ప్రవేశపెట్టింది. మొదట్లో రాష్ట్ర ప్రజలకు వారి పని ఏమిటో సరిగ్గా అవగాహన లేదు కానీ క్రమేపీ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ కార్యకలాపాలను చాలా త్వరగా చేసేసి మరియు ప్రజలకు సంక్షేమ పథకాల అమలును త్వరగా జరిగేందుకు ఉపయోగపడుతున్నారు.

 

అయితే నిన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జరగబోయే పరీక్షల విషయంపై మాట్లాడుతూ మార్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి అని మరియు ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇన్విజిలేటర్లుగా ఉపాధ్యాయులు సరిపోని నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇన్విజిలేటర్ల గా తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రకటనతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు.

అతి కీలకమైన టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు రాసే సమయంలో ఇన్విజిలేటర్ల తీరు వారి పిల్లల పరీక్ష పై ప్రభావం చూపుతుందని మరియు వారి పేపర్లు తీసుకోవడం, పరీక్ష విధానం, ఓఎంఆర్ షీట్లు వంటి వాటిలో చిన్న చిన్న తప్పులు అనుభవం ఉన్న టీచర్లే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఉద్యోగులను ఎలా ఇన్విజిలేటర్లగా పరిగణిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే మరొక వైపు సచివాలయ ఉద్యోగులు మాత్రం తమకు ఎప్పుడూ ఇచ్చేలా నెలకి 15,000 రూపాయల జీతం ఇస్తే ఈ పనికి దీనికి సరిపోదని…. టీచర్లకు ఇన్విజిలేషన్ కి వెళ్ళినప్పుడు ప్రతి పరీక్షకు ఇచ్చే డబ్బులతో పాటు అలోవెన్సులు కూడా తమకు ఇవ్వాలని అధికారులను అడిగారట. మరి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news