బ్రేకింగ్; సడెన్ గా కారు ఆపమన్న కెసిఆర్, ఏం జరిగింది…?

-

రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు ఈ మధ్య మానవత్వం చాటుకుంటున్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నారు. తమకు చేతనైన సాయం చేస్తూ అండగా ఉంటున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకి వెళ్తున్నారు. తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం కాస్త భిన్నంగా సహాయం చేసారు.

ఆయన టోలీ చౌకీ వెళ్తుండగా మార్గ మధ్యలో సలీం అనే వృద్ద వికలాంగుడు ని కెసిఆర్ గుర్తించారు. వెంటనే డ్రైవర్ ని కారు అతని వద్దకు తీసుకువెళ్లమని ఆదేశించారు. అక్కడికి వెళ్ళగానే సలీం తో మాట్లాడి అసలు సమస్య ఏంటీ, పెన్షన్ వస్తుందా…? ఇల్లు ఉందా…? ఎక్కడ ఉంటున్నావ్ అని అడిగారు. తనకు ఇల్లు లేదని, పెన్షన్ అందడం లేదని సలీం చెప్పడంతో వెంటనే ఆ సమస్యను కెసిఆర్ పరిష్కరించారు.

వెంటనే హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి తో మాట్లాడారు. సలీం వివరాలను ఆయనే స్వయంగా చెప్పారు. పెన్షన్ తో పాటుగా డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చెయ్యాలని ఆదేశించారు. దీనితో సలీం హర్షం వ్యక్తం చేసారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన వద్ద కారు ఆపడం, తన సమస్యను ఓపికగా వినడం, వెంటనే పరిష్కరిస్తూ తనకు డబుల్ బెడ్ రూమ్ ఇంటి తో పాటుగా పెన్షన్ ఇవ్వడం పై సంతోషం వ్యక్తం చేసారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news