ఏపీలో ఒక్కసారి అధికారం ప్లీజ్ అంటూ.. ప్రజల మనసులు దోచుకున్న జగన్.. `ఒకే ఒక్కడు` సినిమాలో హీరో మాదిరిగా దూసుకుపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన మంత్రి వర్గ కూర్పు నుంచి ప్రతి ఒక్కరి ప్రశంసలూ పొందుతున్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వంగా ఆయన రికార్డు లు సృష్టించారు. ఎస్సీ మహిళకు హోం శాఖ పగ్గాలు అప్పగించిన సీఎంగా మరింత రాటు దేలారు. ఇక, అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండేలా అనేక పథకాలను ప్రవేశ పెట్టారు.
ఇటీవల సంక్రాంతికి ముందు అమ్మ ఒడి పేరుతో ప్రతి తల్లి ఖాతాలోనూ గుండుగుత్తుగా రూ.15 వేలు వేసి ముందస్తు సంక్రాంతి చేశారు. ఈ పరిణామాలతో జగన్ దూసుకుపోతున్నారు. ఆయన రేటింగ్ ఎలా ఉందంటే.. అని చెప్పుకొనే స్థాయికి చేరుకుంటున్నారు. ఇక, ఇప్పుడు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అసెంబ్లీ ఔన్నత్యాన్ని కాపాడడంలో ఎలాంటి వెనుక అడుగు వేయకుండా ముందుకు దూసుకుపోయారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
శాసన మండలిని రద్దు చేస్తూ.. జగన్ తీసుకున్న నిర్ణయంలో ఒక్క సాహసమే కాదు, విశాల ప్రజల ప్రయోజనం కూడా ఉందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి మరో ఏడాది పాటు జగన్ కళ్లు మూసుకుంటే.. 2021 నుంచి మండలిలో వైసీపీదే ఆధిపత్యం. ఇక, మళ్లీ ఎన్నికల నాటికి అంటే 2024లో చూద్దామన్నా టీడీపీ నుంచి ఒక్కరూ ఉండే పరిస్థితి లేదు. చైర్మ న్, డిప్యూటీ చైర్మన్ పదవులు కూడా వైసీపీకే దక్కనున్నాయి. ఇంతగా రాజకీయ ప్రయోజనం వైసీపీ అది నేత జగన్‌కు మండలి తెచ్చిపెడుతుంది. అయినాకూడా తనను నమ్మి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టిన అసెంబ్లీ చేసిన బిల్లుకు మండలి తూట్లు పొడవడాన్ని ఆయన సహించలేక పోయారు.
ప్రజా బలం లేని నాయకులు మండలిలో తానుప్రజల కోసం చేసిన తీర్మానాన్ని పెండింగ్‌లో పెట్టేలా దుష్ట రాజకీయాలకు తెరదీయడాన్ని జగన్ ఓర్చుకోలేక పోయారు ఈ క్రమంలోనే తన రాజకీయ లబ్ధిని కూడా పక్కన పెట్టి.. కేవలం ప్రజాప్రయోజనమే ప్రభుత్వానికి అంతిమ లక్ష్యమని చాటుతూ.. మండలిని రద్దు చేశారు. దీంతో ఆయన చర్యను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఇప్పుడు ఆయన రేటింగ్‌ను లెక్కగట్టడం అంటే.. నింగిలోకి ఎగిసిన తారాజువ్వేనని అంటున్నారు పరిశీలకులు.