ప్రపంచ వ్యాప్తంగా 60 రాష్ట్రానికి చాలా ప్రభుత్వాలు, దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తూ ఈ వైరస్ ని అరికట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం భూమ్మీద అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. తాజాగా ఇటీవల ఇండియాలో కూడా ఈ వైరస్ ఎంట్రీ అవటంతో దాదాపు 113 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైరస్ అంతగా ప్రభావితం చూపించకపోయినా గాని వైసిపి ప్రభుత్వానికి మాత్రం చుక్కలు చూపిస్తుంది. ఈ వైరస్ వల్ల తాజాగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో 14వ ఆర్థిక సంఘం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన 5 వేల కోట్లు నిధులు ఇప్పుడు వస్తాయో రావో అన్న సందిగ్దంలో పడిపోయింది. గతంలో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలలో మార్చిలోపు ఎన్నికలు పూర్తి చేస్తే గాని 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయదని స్పష్టం చేసింది.
దీంతో ఇటువంటి పరిస్థితుల్లో వైయస్ జగన్ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయంలో జాతీయ స్థాయిలో తల పండిపోయిన కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు నీతి అయోగ్ కి ఎమెర్జెన్సీ పరిస్తితి గురించి వివరిస్తే విడుదల చేస్తారు అనేక రాష్ట్రాలు అలాగే చేశాయి అంటూ జగన్ కి సలహాలు ఇస్తున్నారు. మరి జగన్ ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.