దీనిపై ఇవాళ వైసీపీ నేతలతో పాటు జగన్ కూడా ఈసీని కలవనున్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వాళ్లు ఈసీని కోరనున్నారు. చంద్రగిరిలో లోక్ సభ ఏడో విడుత ఎన్నికలు జరిగే మే 19నే రీపోలింగ్ కూడా జరగనుంది.
ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహణపై ఏపీలో మరోసారి రాజకీయ వేడి రగులుకుంది. పోలింగ్ జరిగింది గత నెల 11న. పోలింగ్ ముగిసిన నెల తర్వాత రీపోలింగ్ జరపడమేందని అధికార పార్టీ ఈసీపై మండిపడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఏకంగా ఢిల్లీకి పోయి… ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈసీ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని.. ఈ అంశంపై తాను ఎంత దూరమైనా వెళ్తానని.. ఆందోళన చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు.
అయితే.. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. రీపోలింగ్ పై తనదైన శైలిలో స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
రీపోలింగ్ అప్రజాస్వామికమమా? లేక రిగ్గింగా? చంద్రబాబు గారు.. చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా? లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డు పడటమా? రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అయిదు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా.. అంటూ జగన్ ట్వీట్ చేశారు.
దీనిపై ఇవాళ వైసీపీ నేతలతో పాటు జగన్ కూడా ఈసీని కలవనున్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వాళ్లు ఈసీని కోరనున్నారు. చంద్రగిరిలో లోక్ సభ ఏడో విడుత ఎన్నికలు జరిగే మే 19నే రీపోలింగ్ కూడా జరగనుంది.
.@ncbnగారూ రీపోలింగ్ అప్రజాస్వామికమా?లేక రిగ్గింగా? చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా?లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డు పడటమా?రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అయిదు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 17, 2019