ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవి ప్రకాశ్, శివాజీకి పోలీసులు చాలాసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా కూడా వాళ్లు విచారణకు హాజరు కాలేదు. దీంతో.. వాళ్లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీకి సైబరాబాద్ పోలీసు షాకిచ్చారు. వాళ్లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఫోర్జరీతో పాటు డేటా చౌర్యం, నిధుల మళ్లింపు లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, శివాజీకి నిన్న అర్ధరాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దీంతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో వాళ్లిద్దరూ దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. రవి ప్రకాశ్ పాస్ట్ పోర్ట్ ను పోలీసులు సీజ్ చేశారు.
ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవి ప్రకాశ్, శివాజీకి పోలీసులు చాలాసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా కూడా వాళ్లు విచారణకు హాజరు కాలేదు. దీంతో.. వాళ్లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అయితే.. వాళ్లపై కేసులు నమోదు కాగానే.. హైదరాబాద్ ను విడిచి పారిపోయారు. ఎక్కడో తలదాచుకున్నారు. వారి ఆచూకి కోసం పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సో.. వాళ్ల ఆచూకీ తెలిసిన మరుక్షణమే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే వాళ్లు దేశం విడిచి పారిపోకుండా.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.