ష‌కీలా బ‌యోపిక్‌.. స్టార్ హీరోల బండారం బ‌య‌ట పెడ‌తార‌ట‌..?

ఒక‌ప్పుడు ష‌కీలా సినిమాలంటే జ‌నం ఎగ‌బ‌డేవారు. ఓ ద‌శ‌లో స్టార్ హీరోల‌ను కాద‌ని ఆమె సినిమాల‌కు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చేవి. దీంతో స్టార్ హీరోలు త‌మ సినిమాలు ఏమైపోతాయోన‌ని భ‌య‌ప‌డేవార‌ట‌. అందుక‌నే ష‌కీలాను పైకి రానీయ‌కుండా అణ‌గ‌దొక్కార‌ని స‌మాచారం.

తెలుగు, త‌మిళ సినీ ఇండ‌స్ట్రీల‌లో సుచీ లీక్స్ ఎంత సంచ‌ల‌నం క‌లిగించిందో అంద‌రికీ తెలిసిందే. ప‌లువురు సెల‌బ్రిటీల‌కు చెందిన ప్రైవేట్ ఫొటోలు, వీడియోల‌ను ఎవ‌రో సోష‌ల్ మీడియాలో లీక్ చేయ‌డంతో ఈ విష‌యంపై అప్ప‌ట్లో పెద్ద దుమార‌మే చెల‌రేగింది. అయితే ఆ త‌రువాత కొంత కాలానికి మ‌ళ్లీ టాలీవుడ్‌లో న‌టి శ్రీ‌రెడ్డి అలాంటి లీక్స్ ఇచ్చి మ‌రోసారి సినిమా ఇండస్ట్రీలో ఉండే వేధింపుల క‌ల్చ‌ర్‌పై పోరాటం చేసింది. కానీ అది కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అయితే త్వ‌ర‌లో ష‌కీలా లీక్స్ వ‌స్తాయా..? అంటే అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ష‌కీలా అంటే తెలియ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు. ఒక‌ప్పుడు ఆమె చేసిన సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఓ ద‌శ‌లో స్టార్ హీరోలు కూడా త‌మ సినిమాలు ఆడుతాయో, లేదోన‌ని భ‌యం చెందారు కూడా. అంత‌గా ష‌కీలా పాపుల‌ర్ అయింది. అయితే నటిగా ఆమె స‌క్సెస్ అయినా.. ఆమె జీవితంలో దుర్భ‌ర స్థితిలో గ‌డిపిన ఎన్నో క్ష‌ణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె జీవితంలోని ఎత్తు ప‌ల్లాల‌ను చూపిస్తూ.. ష‌కిలీ బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నారు. అందులో న‌టి రిచా చద్దా ష‌కీలా పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఇప్ప‌టికే ఆ సినిమాకు చెందిన ప‌లు పోస్ట‌ర్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

అయితే ఆ సినిమా నేప‌థ్యంలో ష‌కీలా ఇటీవ‌లే ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బాల్యంలో ఎంతో దుర్భ‌ర జీవితాన్ని అనుభ‌వించాన‌ని, 16 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో వ్య‌భిచార జీవితాన్ని అనుభ‌వించాన‌ని ఆవేద‌న చెందుతూ చెప్పుకొచ్చింది. త‌న శ‌రీరాన్ని శృంగార భ‌రితంగా చూపించేందుకు య‌త్నించారు కానీ.. త‌న‌లో ఉన్న న‌టిని ఎవ‌రూ బ‌య‌టికి తీయ‌లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలోనే త‌న జీవితంలోని క‌ష్ట న‌ష్టాల‌ను, తాను అనుభ‌వించిన బాధ‌ల‌ను త‌న బ‌యోపిక్‌లో చూపించ‌నున్న‌ట్లు ష‌కీలా చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమాలో ఒక‌ప్పుడు స్టార్ హీరోలు త‌న‌ను ఏవిధంగా అణ‌గదొక్కేందుకు య‌త్నించారో ఆ విష‌యాల‌ను కూడా తెర‌పై చూపించ‌నుంద‌ట‌. అందుక‌నే ష‌కీలా త‌నే ద‌గ్గ‌రుండి త‌న బ‌యోపిక్ మూవీ క‌థ‌ను ప‌ర్యవేక్షించింద‌ని తెలుస్తోంది.

ఒక‌ప్పుడు ష‌కీలా సినిమాలంటే జ‌నం ఎగ‌బ‌డేవారు. ఓ ద‌శ‌లో స్టార్ హీరోల‌ను కాద‌ని ఆమె సినిమాల‌కు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చేవి. దీంతో స్టార్ హీరోలు త‌మ సినిమాలు ఏమైపోతాయోన‌ని భ‌య‌ప‌డేవార‌ట‌. అందుక‌నే ష‌కీలాను పైకి రానీయ‌కుండా అణ‌గ‌దొక్కార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే త‌న సినిమా కెరీర్‌ను నాశ‌నం చేయాల‌నుకున్న స్టార్ హీరోలు, సినీ ప్ర‌ముఖ‌ల‌ పేర్ల‌ను కూడా ష‌కీలా త‌న బ‌యోపిక్‌లో చెబుతుంద‌ని తెలిసింది. మ‌రి ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్‌లాగే ష‌కీలా బ‌యోపిక్ కూడా వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతుందా లేదా సాధార‌ణ బ‌యోపిక్‌గానే మిగిలిపోతుందా.. అన్న వివ‌రాలు తెలియాలంటే.. సినిమా విడుద‌ల‌య్యే దాకా వేచి చూడ‌క త‌ప్ప‌దు..!