పిఠాపురాన్ని జగన్ టార్గెట్ చెయ్యడానికి కారణం అదే.. పార్టీలో హాట్ హాట్ చర్చలు..

-

పార్టీ ఓటమితో నిరాశలో ఉన్న క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దూకుడు మంత్రాన్ని పాటిస్తున్నారు.. పిఠాపురంలో పర్యటించిన ఆయన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంధించిన పవర్ పుల్ డైలాగులు ఇప్పుడు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.. పార్టీని రీచార్జ్ మోడ్ లో పెట్టేందుకు జగన్.. ఉభయగోదావరి జిల్లాలను ఎంచుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉభయగోదావరి జిల్లాల టూర్ వెనుక పొలిటికల్ సర్కిల్ లో సరికొత్త చర్చలు జరుగుతున్నాయి.. ఏ వ్యూహాంతో ఆయన పిఠాపురంలో పర్యటించారనే విషయం అర్దంగాక రాజకీయ పండితులు తలలు పట్టుకుంటున్నారు.. ఏలేరు వరద ముంపుతో నాలుగు నియోజకవర్గాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాలు వరద బారిన పడ్డాయి.. అయితే అన్ని ప్రాంతాలను పక్కనపెట్టి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి జగన్ వెళ్లారు.. అక్కడి రైతులతో మాట్లాడారు.. ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ ఉభయ గోదావరిజిల్లాలోని పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.. మాములుగా సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రతిపక్ష నేతలు ఆసక్తి చూపరు.. ఎందుకంటే వారికి అక్కడ రాజకీయ బలంగా ఎక్కువగా ఉంటుంది.. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.. డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురాన్ని ఎంచుకుని అక్కడి వెళ్లారు.. ఈ పర్యటన బాగా హైప్ వచ్చింది కూడా.. పిఠాపురంలో బటన్ నొక్కితే..అది రాష్టమంతటా ప్రభావం చూపుతుందని జగన్ భావించారట.. అందుకే అక్కడ పర్యటించారని పార్టీ నేతలు చెబుతున్నారు..

రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలలో కలిపి 34 అసెంబ్లీ సీట్లు, ఐదు లోక్సభ సీట్లు ఉన్నాయి.. గత ఎన్నికల్లో ఒక్కచోట కూడా వైసీపీ గెలవలేకపోయింది.. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాలలో పార్టీ రీఛార్జ్ అవ్వాలంటే దూకుడే సరైన అస్త్రమని జగన్ భావిస్తున్నారట.. అందుకే పిఠాపురంలో పర్యటించి.. పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. జగన్ దూకుడు మంత్రంతో వైసీపీ క్యాడర్ యాక్టివ్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news