ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సీట్లు వస్తే ఏం చేయాలి. ఎవరి మద్దతు అయినా కూడగట్టాలంటే ఎలా? అనే వాటిపై ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు.
ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్ జగన్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీంతో వైఎస్ జగన్ చకచకా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సీట్లు వస్తే ఏం చేయాలి.. కార్యాచరణ ఏంటి.. ఎలా ముందుకు సాగాలనే దానిపై రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైఎస్సార్సీపీ పార్టీలోని ముఖ్యమైన నేతలతో తాడేపల్లిలో సమావేశం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం వాళ్లతో జగన్ భేటీ కానున్నారు.
నిజానికి.. ఈ సమావేశం 19నే జరగాల్సి ఉంది. కానీ.. ఎగ్జిట్ పోల్స్ వైఎస్ జగన్ వైపే ఉండటం.. వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం కావడంతో… ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వైఎస్సార్సీపీ అడుగులు వేస్తోంది.
పార్టీ ముఖ్యనేతలతో ఎగ్జిట్ పోల్స్ గురించి జగన్ చర్చిస్తారు. వైఎస్సార్సీపీకి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారమే సీట్లు వస్తాయా? లేక ఏదైనా మార్పు ఉంటుందా? ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం అటూ ఇటూగా ఉంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సీట్లు వస్తే ఏం చేయాలి. ఎవరి మద్దతు అయినా కూడగట్టాలంటే ఎలా? అనే వాటిపై ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్సార్సీపీ నుంచి ఏ నాయకులు హాజరవుతారు అనే దానిపై కూడా స్పష్టత లేదు.