వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొత్సను గెలిపించుకున్న ఆయన.. పార్టీ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. పార్టీలోని పెద్దలతో మాట్లాడి కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను సైతం నియమించారు.. మైలవరానికి జోగి రమేష్ ను ఇన్చార్జిగా నియమించారు.. ప్రస్తుతం ఇదే పార్టీలో పలు చర్చలకు దారి తీస్దోంది..
వైసీపీహయాంలో సీనియర్లను, వివాదరహితులను క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్.. ఇదే కోవలో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే జోగి రమేష్ కు కూడా మంత్రి పదవి ఇచ్చి.. స్థాయిని పెంచారు.. జగన్ ను అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న జోగి రమేష్ కు మాజీ సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.. తాను మొదటి నుంచి కోరుకుంటున్న మైలవరం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ పదవిని ఆయనకు కట్టబెట్టారు..నిజానికి గత ఎన్నికలకు ముందే.. జోగి తన నియోజకవర్గం మార్చమని కోరారు. మైలవరం నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. అయితే.. మైలవరం కాకుండా.. జోగిని పెడన నియోజకవర్గం నుంచి పెనమలూరు నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. ఇక, తాజా ఎన్నికల్లో జోగి ఓడిపోయారు.
జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం కావడంతో అక్కడ ఆయనకు భారీగానే అనుచరగణ ఉంది. ఈ క్రమంలో ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.. ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగిని తిరిగి మైలవరం పంపించడంతో ఈ ఇద్దరి మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉండే అకాశముందని.. అది పార్టీకి లాభిస్తుందని జగన్ భావిస్తున్నారట. మైలవరంలో జోగి రమేష్ చేసే రాజకీయాలు పార్టీకి హైప్ ను ఇస్తాయని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు..