వైఎస్‌ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌… తెరపైకి దస్తగిరి !

-

కడప : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య లో రోజుకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవాళ మాజీ డ్రైవర్ దస్తగిరి, ఆయన భార్యను పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటికే పలుమార్లు దస్తగిరి సిబిఐ విచారణకు హాజరయ్యాడు. తాజాగా మరోసారి దస్తగిరి హాజరు కావడంతో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. దస్తగిరిని పులివెందుల కోర్టులో హాజరు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం నుంచి పులివెందుల కోర్టులో బిజీ బిజీగా ఇద్దరు సిబిఐ అధికారులు ఉన్నారు. సిఆర్ పి 164 కింద జడ్జి సమక్షంలో వాంగ్మూలం రికార్డ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక గత రెండు రోజుల క్రితం వాచ్‌ మెన్‌ రంగయ్య వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు పేర్లు ఆరోపణ చేయగా…అందులో దస్తగిరి సైతం ఉండటం గమనార్హం. ఇక గత రెండు రోజుల క్రితం జమ్మలమడుగు కోర్టులో వాచ్‌ మెన్‌ రంగయ్య వద్ద రికార్డు చేసిన సిఆర్పి 164 వాంగ్మూలాన్ని కావాలని పులివెందుల కోర్టులో సిబిఐ అధికారులు పిటిషన్ వేసినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news