షర్మిలకు రివర్స్ షాకులు…మొదట్లోనే…!

-

తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన షర్మిలకు రాజకీయంగా ఏది కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి ఇక్కడ కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెబుతున్న షర్మిలకు ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. అసలు పార్టీ పెట్టగానే, ఇతర పార్టీల నాయకులు వరద మాదిరిగా షర్మిలకు జై కొడతారని అంతా అనుకున్నారు. కానీ పార్టీ పెట్టాక ఒక్క నాయకుడు కూడా వైఎస్సార్టీపీలోకి రాలేదు.

అలాగే ఆమె చేసిన దీక్షలకు కూడా పెద్దగా స్పందన కూడా రావడం లేదు. ఆమె ఎక్కడకు వెళ్ళిన పెద్ద ఎత్తున జనం అయితే రావట్లేదు. ఏదో కొంతమంది వైఎస్సార్ అభిమానులతో దీక్షలని మమ అనిపిస్తున్నారు. అయితే పార్టీని బలోపేతం చేసే క్రమంలోనే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆ కమిటీలకు నాయకుల నుంచి పెద్ద స్పందన కూడా రావడం లేదు. అలాగే ఆ పార్టీకి క్యాడర్ సపోర్ట్ కూడా పెద్దగా వచ్చేలా కనిపించడం లేదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీలో ఉన్న కొందరు కీలక నాయకులు రివర్స్‌లో షాక్ ఇచ్చి, మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్లడానికి చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే షర్మిల వెనుక ఎక్కువగా కనిపిస్తున్న ఇందిరాశోభన్ మళ్ళీ కాంగ్రెస్ గూటికి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఎందుకంటే షర్మిల పార్టీలో ఆమెకు తగిన గౌరవం ఉండటం లేదని, ఇప్పటికే పార్టీలో ఉన్న కీలక నేతలు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి సైతం, ఆమెని కాంటాక్ట్ అయ్యి, కాంగ్రెస్‌లోకి తిరిగి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెతో పాటు, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్‌లో చెరోచ్చని ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే మొదట్లోనే షర్మిలకు గట్టి షాకులు తగిలేలా కన్పిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news