గత ఎన్నికల్లో వీళ్లు చాలా తక్కువ మెజారిటీతో గెలిచినా.. ఈసారి మాత్రం టఫ్ ఫైటేనట. వీళ్లకు వ్యతిరేకంగా పోటీకి దిగినవాళ్లు కూడా మామూలు వ్యక్తులేమీ కాదు. బలమైన అభ్యర్థులనే టీడీపీ పోటీలోకి దించింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు.. అనే దానిపై టెన్షన్ స్టార్ట్ అయింది.
ఏపీలో ఎన్నికలు అయితే ముగిశాయి కానీ.. ఇప్పుడు అసలు టెన్షన్ స్టార్ట్ అయింది. ఎన్నికల ముందు ఉన్న టెన్షన్ కంటే ఇది పెద్ద టెన్షన్. ప్రధాన పార్టీలన్నీ ఈసారి గెలుస్తామా? లేదా? అన్న టెన్షన్‌లో ఉన్నాయి. అయితే.. వైఎస్ జగన్‌లో కూడా ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్నా కొద్దీ టెన్షన్ పెరుగుతోందట. వైసీపీ గెలుస్తుందా? లేదా? అన్న టెన్షన్ కాదు.. ఓ ముగ్గురు అభ్యర్థుల వల్లనే జగన్‌లో టెన్షన్ పెరుగుతోందట.
వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన ఆ ముగ్గురు నేతల వల్లనే ఆయనలో టెన్షన్ రోజురోజుకూ పెరిగిపోతోందట. ఏది ఏమైనా ఆ ముగ్గురు నేతలు గెలవాలనే కసితో ఉన్నారట జగన్. ఇంతకీ ఆ ముగ్గురు నేతలు ఎవరబ్బా అంటారా? ఇంకెవరు.. ఫైర్ బ్రాండ్ రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్.
గత ఎన్నికల్లో వీళ్లు చాలా తక్కువ మెజారిటీతో గెలిచినా.. ఈసారి మాత్రం టఫ్ ఫైటేనట. వీళ్లకు వ్యతిరేకంగా పోటీకి దిగినవాళ్లు కూడా మామూలు వ్యక్తులేమీ కాదు. బలమైన అభ్యర్థులనే టీడీపీ పోటీలోకి దించింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు.. అనే దానిపై టెన్షన్ స్టార్ట్ అయింది.
వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఆయనపై టీడీపీ నుంచి నారా లోకేశ్ పోటీ చేశారు. అయితే.. సర్వేలు కూడా ఆర్కే వైపే ఉన్నప్పటికీ.. అసలే నారా లోకేశ్.. ఎలాగైనా గెలవాలన్న ఆశతో డబ్బులను వెదజల్లారని.. దీంతో ఏమన్నా అటూ ఇటూ అయితే సమస్యే అని తలపట్టుకున్నారట జగన్.
జగన్‌కు మరో అత్యంత సన్నిహితులు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఆయనపై టీడీపీ మంత్రి నారాయణను బరిలోకి దించింది. మంత్రి నారాయణ కూడా ఈసారి మళ్లీ గెలవాలన్న ఉద్దేశంతో డబ్బులు వెదజల్లాడని టాక్ వచ్చింది. దీంతో అనిల్ కుమార్ విషయంలో ఏదైనా జరుగుతుందా? అని జగన్ టెన్షన్ పడుతున్నారట.
ఇక మిగిలింది.. ఆర్కే రోజా. వైసీపీ ఫైర్ బ్రాండ్. రోజా గెలవడం ఖాయం అని తెలుస్తున్నప్పటికీ… ఎందుకో టీడీపీ అభ్యర్థి భాను ప్రకాశ్ గెలుస్తారా? అన్న సందేహాలు వస్తున్నాయట. ఏది ఏమైనా వీళ్లు ముగ్గురిని గెలిపించుకోవాలన్న కసితో జగన్ ఉన్నారట. దాంతో పాటు.. వీళ్లు ముగ్గురి గురించే తెగ టెన్షన్ పడుతున్నారట.