రంగువత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన చేస్తే అంతా శుభమే! ఏప్రిల్ 28 రాశిఫలాలు

మేషం : ఆరోగ్య పరంగా విశ్రాంతి అవసరం, కుటుంబ నుంచి శుభవార్తా శ్రవణం, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి, పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి, ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి. పనులు పూర్తవుతాయి. విందులు.
పరిహారం: ప్రాతఃకాలంలో సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. వీలైతే దేవాలయ దర్శనం చేయండి.

వృషభరాశి : విశ్రాంతి అవసరం, కుటుంబ సహకారం, ఓపిక అవసరం, పనిచేసే చోట నిజాయితీగా ఉండాలి, ప్రయాణాలు అనుకూలిస్తాయి, స్టాక్‌మార్కెట్లు కలిసివస్తాయి, అధిక ఖర్చులు.
పరిహారాలు: నవగ్రహా ప్రదక్షిణలు, తొమ్మిది రంగుల వత్తులతోదీపారాధన కలిసి వస్తాయి.

April 28th Sunday daily horoscope
April 28th Sunday daily horoscope

మిథునరాశి : ఆనారోగ్య సూచనలు, కుటుంబంలో అపార్థాలు, పని ఒత్తిడి, ప్రయాణాలు తప్పనిసరైతేనే చేయండి, ఖర్చు పెరుగుతుంది, స్టాక్ మార్కెట్లు అనుకూలించవు. విందులు, వివాదాలకు దూరంగా ఉండాలి.
పరిహారాలు: మొదట నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి తర్వాత ఆంజనేయస్వామి దేవాయలంలో 21 ప్రదక్షిణలు చేయండి.

కర్కాటకరాశి : ఆరోగ్యం, కుటుంబ సహకారం, పనిచేసే చోట ఒత్తిడి, ప్రయాణాలు కలిసి వస్తాయి. విందులు, పనులు పూర్తి, స్టాక్‌మార్కెట్ అనకూలిస్తుంది.
పరిహారాలు: శివాభిషేకం, తెల్లజిల్లేడుతో పూజ మంచి ఫలితాలు వస్తాయి.

సింహరాశి : మంచి అరోగ్యం, కుటుంబంలో సంతోషం, పనిచేసే చోట అనుకూల మార్పులు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు పూర్తి, సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

కన్యారాశి : ఆనారోగ్య సమస్యలు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి, పనిచేసే చోట ఒత్తిడి, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి, శ్రమ. విందులు, అధిక శ్రమ.
పరిహారాలు: రాహుకాలంలో ఏదైనా దేవాలయంలో లేదా ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చేయండి మంచి ఫలితం ఉంటుంది.

తులారాశి : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించండి, ప్రేమికులకు అనుకూలం, పనిలో ఇబ్బంది, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి, అనవసర ఖర్చులు, ట్రేడింగ్ కలిసిరాదు. అనవసర ఖర్చులు.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర తొమ్మిది రంగుల వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితం ఉంటుంది.

వృశ్చికరాశి : మంచి ఆరోగ్యం, కుటుంబ సహకారం, వివాదాలకు దూరంగా ఉండండి, పనిచేసే చోట అనుకూల మార్పులు, విందులు, పనులుపూర్తి, ఆర్థికంగా బాగుంటగుంది. స్టాక్ మార్కెట్లు కలిసివస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదలకు సహాయం చేయండం మంచి చేస్తుంది.

ధనస్సురాశి : మంచి ఆరోగ్యం, కుటుంబ సఖ్యత, పనిచేసేచోట మంచి మార్పులు, ప్రయాణాలు అనుకూలిస్తాయి, పనులు పూర్తి, సంతోషం. విందులు, పనులు పూర్తి, మిత్రలాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ సందర్శన మంచిచేస్తుంది.

మకరరాశి : మంచి ఆరోగ్యం, శుభకార్య సూచన, వృత్తిలో మంచి ఫలితాలు, ప్రయాణాలు అనుకూలం, ఆర్థికంగా బాగుటుంది, సంతోషం. పనులు పూర్తి, పూర్వ మిత్రులక లయిక, లాభం.
పరిహారాలు: శనిగ్రహానికి, సూర్యగ్రహానికి తొమ్మిది రంగుల వత్తులతో దీపారాధన మంచి ఫలితం ఇస్తుంది.

కుంభరాశి : మంచి ఆరోగ్యం, కుటుంబ సఖ్యత, అధికశ్రమ, ప్రయాణాలు అనుకూలిస్తాయి, పనులు పూర్తి, సంతోషం, స్నేహితుల సహకారం, ధనలాభం, వస్తులాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంటే దర్శనం చేయండి అద్భుత ఫలితాలు ఉంటాయి. లేకుంటే సూర్యనికి నమస్కారాలు.

మీనరాశి : మంచి ఆరోగ్యం, పిల్లల వల్ల పేరు, ఆర్థికంగా బాగుంటుంది, స్టాక్‌మార్కెట్లు కలిసివస్తాయి, కుటుంబంలో సంతోషం, ప్రయాణాలు అనుకూలం, ఆనందం, విందులు. వస్తులాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామ స్మరణ మంచి చేస్తుంది.

– కేశవ