మహిళలకు గుడ్ న్యూస్ : వైయస్సార్‌ చేయూత డబ్బులు జమ

-

వైయస్సార్‌ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. కాసేపటి క్రితమే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా అక్షరాల 23.44 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని.. వారి కుటుంబ సభ్యులతో కలిపితే కోటిమందికి లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. దాదాపు రూ.4400 కోట్లు చేయూత కింద నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 45–60 సంవత్సరాల మధ్యనున్న ప్రతి అక్కా, చెల్లెమ్మకూ అర్హులైన వారి అందరికీ చేయూత పథకింద రూ.18500 ప్రతి ఏటా , వరుసగా నాలుగేళ్లపాటు ఇస్తామని చెప్పామని.. రూ.75వేలు నేరుగా వారి బ్యాంకు అక్కౌంట్లలో వేసే గొప్ప కార్యక్రమమన్నారు. వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని.. అక్కచెల్లెమ్మలు తమ కష్టాన్ని నమ్ముకున్నవారని పేర్కొన్నారు.

45–60 ఏళ్ల మధ్య నున్న అక్కచెల్లెమ్మలు అత్యంత బాధ్యతాయుతమైన వ్యక్తులు అని.. వీరిచేతిలో డబ్బు పెడితే ఇది పూర్తిగా వారి కుటుంబం మంచి కోసం, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందనే ఈ కార్యక్రమం అమలు చేశామని వెల్లడించారు సీఎం జగన్‌. వైయస్సార్‌ చేయూత ద్వారా లబ్ధిపొందుతున్నమహిళల్లో దాదాపు 6 లక్షలకుపైగా ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఉన్నారని… సామాజిక పెన్షన్ల ద్వారా వీరికి లబ్ధి వస్తున్నా.. అటువంటి వారికే ఎక్కువ సహాయం అందించాలన్న దృఢ నిర్ణయంతో ఈ సహాయం చేస్తున్నామని ప్రకటించారు. వీరికి ఎలాగూ పెన్షన్ల రూపంలో ఆర్థిక సహాయం వస్తుందని చాలామంది చెప్పినా.. వారికి ఆర్థిక సహాయం చేస్తున్నామని.. తొలిఏడాది దాదాపుగా 24 లక్షలమందికి రూ.18,750 చొప్పున గత సంవత్సరం జమచేశామని చెప్పారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news