వైసీపీ ఎమ్మెల్యేకు రేష‌న్ బియ్యం.. షాక్‌లో ఎమ్మెల్యే

-

ఓ గ్రామం వాలంటీర్లు వైసిపి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరి ఆయనకు రేషన్ బియ్యం ఇవ్వటం సంచలనంగా మారింది. సదరు వాలంటీర్ తెల్లరేషన్ కార్డుకు ఎమ్మెల్యే అర్హుడేనా అన్న విషయం తెలియక ఈ పని చేశాడా ?లేదా తనకు అప్పగించిన పనిని సక్రమంగా చేశాడా ? అన్నది క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది. అయితే దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇస్తూ తెల్లరేషన్ కార్డు ఉందన్న సంగతి తెలియదు అని చెబుతున్నారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నాన‌ని కూడా చెప్పారు. ఈ విషయం ప్రస్తుతం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజుకు తెల్ల రేషన్ కార్డు ఉండటం… ప్రభుత్వం నియమించిన వాలంటీర్ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి రేషన్ బియ్యం ఇవ్వటం ఇప్పుడు కాంట్రవర్సీ గా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి తెల్లరేషన్ కార్డు ఎలా ? వచ్చింది… అధికారులు ఎలా ? ఇచ్చారు… ఇప్పుడు ఆయన ఇంటికి బియ్యం తీసుకెళ్లి ఎలా ఇచ్చారు తెలియాల్సి ఉంది. ఈ విషయం వివాదాస్ప‌దం కావడంతో ఎమ్మెల్యే అప్ప‌ల‌రాజు స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్యే అప్పలరాజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జీఎంఈ రియ‌ల్ ఎస్టేట్‌లో నివాసం ఉంటున్నారు. ఆయ‌న పేరిట రేష‌న్ కార్డు ఉండ‌డంతో స్థానిక వ‌లంటీర్ ఆయ‌న‌కు ఇంటికెళ్లి మ‌రీ రేష‌న్ ఇచ్చారు.

Ysrcp Mla having white rationcard
Ysrcp Mla having white rationcard

ఎమ్మెల్యే త‌న కుటుంబ స‌భ్యుల‌తో రేష‌న్ అందుకుంటోన్న ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వివరణ ఇచ్చుకున్నారు. తనకు తెల్లకార్డు ఉందన్న విషయం తెలీదని చెప్పారు. ఒకవేళ కార్డు ఉంటే ఇన్నాళ్లూ రేషన్‌ తీసుకోనందుకు అది క్యాన్సిల్ కావాలి ? క‌దా ? అని కూడా ప్ర‌శ్నించారు. మ‌రోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ రేష‌న్ కార్డు ఉండ‌డంతో ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పేద‌ల‌కు ద‌క్కాల్సిన రేష‌న్ ఎమ్మెల్యే తీసుకోవ‌డం ఏంటంటూ వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎమ్మెల్యే వెర్ష‌న్ మ‌రోలా ఉంది. వ‌లంటీర్ నేరేగా ఇంటికే బియ్యం తెచ్చి ఇచ్చార‌ని… అది వారి పార‌ద‌ర్శ‌క ప‌నితీరుకు నిద‌ర్శ‌నం అని చెపుతున్నారు.

విప‌క్ష నేత‌లు మాత్రం తెల్ల‌రేష‌న్ కార్డు కావాలంటే ఎవ‌రైనా నేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని… ఈ విష‌యం ఎమ్మెల్యేకు తెలియ‌దా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పటికే బియ్యం పంపిణీలో నాసి రకం బియ్యం అనేక ప్రాంతాల్లో సరఫరా చేసారనే ఆరోపణల నడుమ..ఇప్పుడు ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు..బియ్యం పంపిణీ పైన ఇంకా ఎటువంటి రాజకీయ విమర్శలు మొదలవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news