సిక్కోలు సీటుపై వైసీపీ గురి.. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా ప్లానేసిన వైసిపి..

-

సిక్కోలు పై వైసీపీ సీరియస్ గా గురి పెట్టింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఆయన బాబాయ్ ప్రస్తుత టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు కు చెక్ పెట్టేలా వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. వారిద్దరిపై సరైన అభ్యర్థులను బరిలోకి దించాలని సమాలోచనలు అనంతరం సిక్కోలు ఎంపి స్థానం నుంచి పేరాడ తిలక్ ను పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావించింది..

2019లో జరిగిన ఎన్నికల్లో టిడిపి గెలుచుకున్న మూడు ఎంపీ స్థానాల్లో శ్రీకాకుళం ఒకటి..తండ్రి ఎర్రంనాయుడు మృతితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కింజారపు రామ్మోహన్ నాయుడు 2014 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి సిక్కోలులో పట్టు సాధించాడు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆలోచనలో ఉన్న రామ్మోహన్ నాయుడుకు వైసిపి అధిష్టానం చెక్ పెడుతుంది..శ్రీకాకుళం ఎంపీ స్థానంతో పాటు.. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కిలి అసెంబ్లీ స్థానాన్ని కూడా చేజిక్కించుకోవాలని వైసీపీ పెద్దలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారట..

దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పట్టున్న మంచి పేరున నేతల్ని బరిలోకి దింపాలని వైసీపీ సమాలోచనలు జరిపిందట. తొలుత శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి మంత్రులు ధర్మాన ప్రసాదరావుతో పాటు కృష్ణదాసు, తమ్మినేని సీతారాం వంటి నేతల పేర్లను మొదట్లో వైసీపీ పరిశీలించింది.. అనంతరం సుదీర్ఘ మంతనాలు జరిపి కళింగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పేరాడ తిలక్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది..

గత అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి ప్రాతినిధ్యం వహించిన పేరాడ తిలక్ అచ్చం నాయుడు చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అలాగే రామ్మోహన్ నాయుడు చేతిలో దువ్వాడ శ్రీనివాస సైతం ఓడిపోయారు.. ఈసారి దువ్వాడ శ్రీనివాస్ ను అచ్చం నాయుడు పై పోటీ పెట్టింది వైసిపి అధిష్టానం. పేరాడ తిలక్ తో పాటు దువ్వాడ శ్రీనివాస్ లు మధ్య అంతర్గత విభేదాలు లేకుండా వైసిపి అధిష్టానం జాగ్రత్త పడిందట.. ఒకరికొకరు సహకరించుకొని సిక్కోలు ఎంపీ తోపాటు టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని సైతం గెలుచుకోవాలని సీఎం వారికి సూచించారని పార్టీలో చర్చ నడుస్తుంది. మొత్తానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. అబ్బాయి, బాబాయ్ లకు చెక్ పెట్టేందుకు వైసిపి అధిష్టానం పెద్ద కసరత్తే చేసిందని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news