వైసీపీ యుఎస్‌ఏ సోషల్‌ మీడియా కమిటీలు రెడీ

-

2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఏపీలో రీజినల్‌ కోఆర్డినేటర్‌లను నియమించిన సీఎం వైఎస్‌ జగన్‌ అటు విదేశాల్లోనూ సోషల్‌ మీడియాను యాక్టివ్‌గా ఉంచుతున్నారు. ఇదే క్రమంలో యుఎస్‌ఏ సోషల్‌ మీడియా కమిటీని ఏర్పాటు చేశారు.యూఎస్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్ గా గంగిరెడ్డిగారి రోహిత్ ను నియమించారు.కో కన్వీనర్లుగా పల్లేటి ఆదిత్య, చిల్ల కిరణ్ కుమార్, బంకా తేజ యాదవ్, మైలం సురేష్ ను నియమించారు.

అలాగే అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు వైసీపీ అధినేత. అడ్వైజరి కమిటీ మెంబర్లుగా మేక సుబ్బారెడ్డి, సమన్విత రెడ్డి, జగన్ మోహన్, బైరెడ్డి పార్థ, అరిగ రఘు, సునీల్ లకు ఈ కమిటీలో చోటు దక్కింది. సోషల్ మీడియా ప్రాపర్టీస్ మేనేజ్ మెంట్ కో ఆర్డినేటర్ గా రాయల్ రెడ్డి ని నియమించి సభ్యులుగా మోక్షవర్ధన్ రెడ్డి, సునీల్ కుమార్, ప్రణీత్ రెడ్డి, మల్లేష్, సాయి తేజలను చేర్చారు. నెట్ వర్క్ మేనేజ్ మెంట్ టీం కో ఆర్డినేటర్ గా భారత్ పటిల్ సభ్యులుగా శ్రీహర్ష, సందీప్ రాఘవరెడ్డి, వెంకట సురేంద్ర గౌడ్, మధు, భాను ప్రసాద్, ప్రమోద్ రెడ్డిని నియమించారు. డిస్ట్రిబ్యుషన్ మేనేజ్ మెంట్ కో ఆర్డినేటర్ గా ప్రతాప్ రెడ్డిని నియమించగా.. సభ్యులుగా గోపి, హర్ష రెడ్డి, అన్విత రెడ్డి, తరుణ్ రెడ్డి, శౌరి సన్హిత్, భావనను చేర్చారు.

ఇన్ప్లూయేన్సర్ కో ఆర్డినేటర్ గా కార్తీక్ రెడ్డి ఉండగా.. సభ్యులుగా చరణ్, రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి, భూమిరెడ్డి, వెంకట్ పాలను నియమించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేఫికేషన్‌ ఫిబ్రవరిలో వచ్చే అవకాశమున్న నేపథ్యంలో వివిధ రకాల కమిటీ నియామకాన్ని సీఎం జగన్‌ వేగవంతంగా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వీరంతా పనిచేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్య,ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళిన వారిని వైసీపీ పీట్ల మరింతగా ఆకట్టుకునే విధంగా సమర్థవంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కమిటీల సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news