ఈ సారి కూడా జగన్‌కే పట్టాభిషేకం.. జగన్ గెలుపును ఆపలేరు

-

ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అడక్కుండానే రెండోసారి అధికారాన్ని కట్టబెట్టేందుకు ఏపీ ప్రజలు సిద్ధమయ్యారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే అంటున్నాయి కొన్ని సర్వే సంస్థలు. వర్షాకాలంలో నదుల్లో నీటిమట్టం పెరుగుతున్నట్టు ఏపీలో సీఎం జగన్‌ గ్రాఫ్‌ డైలీ పెరుగుతున్నట్లు సర్వే సంస్థలు చెప్తున్నాయి.సింగిల్‌గా వచ్చినా పొత్తుతో వచ్చినా వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమని అంటున్నాయి.

పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం, జనసేన కలిసివెళ్లినా ? విడివిడిగా వెళ్లినా గెలుపు జగన్ వైపే ఉంటుందని ఆ సర్వే తేల్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు వస్తాయని టిడిపి జనసేన కలిసి వెళ్తే వారికి 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ఇతరులకు పదిశాతం ఓట్లు వస్తాయని సర్వే చెప్తోంది. ఇక సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే ప్రశ్నకు 56 శాతం మంది జగన్ కు ఓటేయగా , చంద్రబాబుకు 37 శాతం మంది జైకొట్టారు.

పవన్‌ను కేవలం 7 శాతం మంది మాత్రమే ఎంచుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన బాగుందని 56 శాతం మంది చెప్పగా 22 శాతం మంది బాలేదని అన్నారు. 9 శాతం మంది చాలా బాగుందని చెప్పగా 8 శాతం మంది అసలు బాలేదని అన్నారు. మూడు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? 2019తో పోలిస్తే వైయస్‌ఆర్‌సీపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది.

తెలుగు దేశం పార్టీ పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేనందున ఈసారి జగన్‌ను ఎదుర్కొనేందుకు పొత్తుల కోసం ప్రయత్నిస్తోంది. అటు బిజెపి.. జనసేనలో పొత్తులో ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. ఈయనతో వెళితే మొత్తాన్ని ముంచేసేలా ఉన్నాడు అనే సంశయం మొదలైంది. అలాగని పొత్తులేకుండా వెళితే ఓటమి కన్ఫామ్ అయినట్టే. ఇక బిజెపికి సైతం రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తప్పేలా లేదు.. దీంతో బిజెపితో వెళ్లాలా వద్దా? వెళ్తే ఏమవుతుందో అనే భయం వెంటాడుతోంది.

ఇక ఇటు పవన్ కళ్యాణ్ సైతం ఒక దిశా నిర్దేశం లేని మార్గంలో పయనిస్తూ తనకుతానే దారితప్పిపోతున్నారు. ఇక జగన్ మాత్రం ఎవర్నీ నమ్ముకోకుండా ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మీ ఇంట్లో మేలు జరిగితే.. మీకు మంచి జరిగితే మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇవన్నీ గ్రహించిన ప్రజలు జగన్‌కు మరోమారు పట్టంగట్టే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news