ఏపీలో మరోసారి జగన్ సునామి.. లేటెస్ట్ సర్వేతో టీడీపిలో గుబులు..

-

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. సిద్ధం సభలతో సీఎం జగన్ పొలిటికల్ హిట్ పెంచేశారు. ప్రతి చోట సీఎం జగన్కు ప్రజలు జననీరాజనం పలుకుతున్నారు. మరోపక్క టిడిపి జనసేన పొత్తు ఖరారైంది.. పొత్తులో బిజెపి ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రానప్పటికీ.. ప్రముఖ జాతీయ సంస్థలు చేస్తున్న సర్వేలో మాత్రం వైఎస్ఆర్సిపి కి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి.

ఇప్పటికే టైమ్స్ నౌ, ఇండియా టీవీ, పోల్ స్ట్రాటెజీ, పొలిటికల్ క్రిటిక్ సంస్థలు చేపట్టిన సర్వేల్లో వైసీపీ తన ప్రభంజనాన్ని చాటుకుంది. గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు సైతం వైఎస్ఆర్ సీపీకే పట్టంకటేందుకు సిద్ధమవుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలతో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. 2024 ఎన్నికల్లో కూడా ఆ పార్టీని అధికారం చేపడుతుందంటూ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. తాజాగా జీన్యూస్ సంస్థతో పాటు మరో సంస్థ చేసిన సర్వే టిడిపి జనసేన నేతల్లో గుబులు రేపుతోంది. జీన్యూస్-మ్యాట్రిజ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించనుంది. గత ఎన్నికల్లో 22 స్థానాలు దక్కగా.. ఈసారి మూడు స్థానాలు తగ్గుతాయని తెలిపింది. అలాగే తెలుగుదేశం-జనసేన కూటమికి ఆరు స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అసలు వ్యతిరేకతే లేదని.. సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా గడపగడపకు అందిస్తుండడంతో.. ప్రజలందరూ జగన్ పాలన వైపే ముగ్గు చూపుతున్నారని సర్వేలో పేర్కొంది.. ఈ లెక్కన వైసీపీ 133 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. వైసీపీకి 48 శాతం ఓట్ షేర్, టీడీపీ-జనసేనకు 44 శాతం వస్తుందని సర్వే సంస్థ అంచనా వేసింది. జనాధర్ ఇండియా సర్వేలోనూ వైసీపీకి అధికారం ఖాయమని తేలింది 125 సీట్లు వైసీపీకి వస్తాయని.. టీడీపీ-జనసేన కూటమికి 50 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వే తో వైసీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news