పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఇది అలర్ట్. రాష్ట్రంలో పాలిసెట్ దరఖాస్తుల గడువును నేటి వరకు అవకాశం కల్పించిన అధికారులు… రూ. 100 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఈ మేరకు పాలిసెట్ కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. ఈ నెల 30వ తేదీన పరీక్ష జరగనుండగా…ఎంట్రెన్స్ టెస్ట్ జరిగిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సులు, బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ (బీటెక్) కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. పోయిన సంవత్సరం.. ఎస్సెస్సీ పరీక్షలు జరగకపోవడంతో పాలిసెట్ ర్యాంకుల ద్వారా సీట్లను భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది కూడా.. అదే విధానాన్ని కొనసాగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.