టీం ఇండియా అతన్ని ఆడించకుండా తప్పు చేసింది: పాంటింగ్

-

ఈ రోజు మధ్యాహ్నం నుండి ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే తుది జట్టులో రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. పిచ్ పరిస్థితుల ప్రకారం స్పిన్ కు ఎక్కువగా అనుకూలిస్తుందని చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా ఇండియా కేవలం ఒక్క స్పిన్నర్ తోనే బరిలోకి దిగింది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుది జట్టులోకి అశ్విన్ ను తీసుకోకుండా ఇండియా పొరపాటు చేసిందని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బాటర్లు ఉన్నారు.

వారిని అవుట్ చేయాలంటే ఆఫ్ స్పిన్నర్ లు ఖచ్చితంగా ఉండాలి. కానీ జట్టులోకి మాత్రమే జడేజా రూపంలో ఒకే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ను అంటూ కామెంట్ చేశారు. ఇక మైకేల్ వాన్ కూడా ఇండియా నిర్ణయాన్ని తప్పు బట్టాడు .

Read more RELATED
Recommended to you

Latest news