ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా మరింత సస్యశ్యామలం కానున్నది. దశాబ్దాలుగా పరితపించిన రైతు ల సాగునీటి కల తీరనున్నది. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభు త్వం మంజూరు చేసింది. ఈ ఎత్తిపోతలతో అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పనులను సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మడలో బుధవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఇక్కడే పంప్‌హౌస్ నిర్మాణానికి 35 ఎకరాలను అధికారులు సేకరించారు.
సింగూర్ నీళ్లు ఇక్కడి ప్రజల సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకే ఉపయోగపడేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలన్నారు. ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తామన్నారు.