టాలీవుడ్ అందాల భామ పూజా హెగ్దేకు అరుదైన అవకాశం దొరికింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు భారత ప్రతినిధిగా ఆమె హాజరు కానున్నారు పూజా హెగ్దే. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు ఈ నెల 17న మొదలు కానున్నాయి. ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఈ వేడుకల్లో భారత ప్రతినిధిగా పూజా హెగ్డే హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
ఇదిలా ఉంటే… దక్షిణాది చిత్రాల్లో సత్తా చాటుతున్న పూజ… కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలకు ఈ ఏడాదే తొలిసారి హాజరు కానుంది. అంటే… ఈ వేడుకలకు తొలిసారి హాజరవుతున్న సమయంలోనే భారత దేశ ప్రతినిధిగా వేడుకల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారన్న మాట.